ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: అవయవదానంపై పెరుగుతున్న అవగాహన

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:30 AM

ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ప్రచారం, నిండుప్రాణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత తదితరాల నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రాష్ట్రంలో గత ఏడాది 266 మంది అవయవదానం చేయడమే ఇందుకు నిదర్శనం. అలాగే, 1,484 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

- గత ఏడాది 266 మంది అవయవదానం

- 1,484 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు

చెన్నై: ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ప్రచారం, నిండుప్రాణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత తదితరాల నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రాష్ట్రంలో గత ఏడాది 266 మంది అవయవదానం చేయడమే ఇందుకు నిదర్శనం. అలాగే, 1,484 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వాహనాలతో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Superstar Rajinikanth: మంచివారిని దేవుడు పరీక్షిస్తాడు


ఈ ప్రమాదాల్లో అనేకమంది మృత్యువాతపడుతున్నారు. అదే సమయంలో రోడ్డు, అగ్ని ప్రమాదాల్లో చికిత్స పొందుతున్న వారికి అవయవాల మార్పిడి చేసి పునర్జన్మ ఇవ్వాల్సివస్తోంది. కానీ, అవయవదానం చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో 2008లో కలైంజర్‌ అవయవదానం ప్రాజెక్ట్‌ ప్రారంభించారు. 2015లో ఆ ప్రాజెక్ట్‌ తమిళనాడు శరీర అవయవాల మార్పిడి శస్త్రచికిత్స కమిషనరేట్‌గా పేరు మారింది. ఆ ప్రకారం, మృతుల కుటుంబీకుల అంగీకారంతో అవయవాలను ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా వెలికితీసి అవసరమైన ఆసుపత్రులకు పంపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో 2023లో అవయవదానం చేసే వారికి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. ఆ ప్రకారం, అవయవదానం చేసే వారి భౌతికదేహాలకు ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ... అవయవదానం చేసే వారి భౌతికదేహాలకు ప్రభుత్వ లాంఛనాలతో అంజలి ఘటిస్తామనే ప్రకటన నేపథ్యంలో, అవయవదానం చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.


గత ఏడాది 266 మంది అవయవదానం చేయగా, 1,484 అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 2,053 మంది అవయవదానం చేయగా, 12,104 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు. అలాగే, 14,300 మంది అవయవాలు దానం చేసేందుకు పేర్లు నమోదుచేసుకున్నారన్నారు. 2021లో 14 ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రుల్లో మాత్రమే అవయవమార్పిడి శస్త్రచికిత్సలకు అనుమతులివ్వగా, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రులకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 11:30 AM