Share News

HAL LCH Outsourcing to Private Sector: ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:02 AM

భారత సైన్యం, వైమానిక దళాల కోసం 156 ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీకి 62,500 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్), అందులో రూ.25 వేల కోట్ల పనులను ప్రైవేటు రంగ సంస్థలకు అప్పగించనుంది

HAL LCH Outsourcing to Private Sector: ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు

బెంగళూరు, ఏప్రిల్‌ 7: భారత సైన్యం, వైమానిక దళాల కోసం 156 లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) అందించేందుకు రూ.62,500 కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) అందులో రూ.25వేల కోట్ల విలువైన పనులను ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ప్రైవేటురంగ సంస్థలకు అప్పగించనుంది. స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఒప్పందం జరిగింది. ఎల్‌సీహెచ్‌ ప్రాజెక్టులో ప్రైవేటు రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు హాల్‌ త్వరలోనే టెండర్లు పిలవనుందని రక్షణ అధికారులు వెల్లడించారు

Updated Date - Apr 08 , 2025 | 06:02 AM