ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: ‘గుర్రపు థాలీ దుంప’ మాదకద్రవ్యమా...

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:55 PM

దిండుగల్‌(Dindigal) జిల్లా కొడైకెనాల్‌ కువుంజి పరిసర ప్రాంతాల్లో పండించే ‘గుర్రపు థాలీ దుంప’లో మాదకద్రవ్యాలున్నాయా? లేదా అని పరిశోధనకు పంపాలని పోలీసులు నిర్ణయించారు. కొడైకెనాల్‌(Kodaikanal) కవుంజి, పూండి తదితర ప్రాంతాల్లో ఈ దుంప సాగవుతోంది.

- పరిశోధనకు పంపాలని పోలీసుల నిర్ణయం

చెన్నై: దిండుగల్‌(Dindigal) జిల్లా కొడైకెనాల్‌ కువుంజి పరిసర ప్రాంతాల్లో పండించే ‘గుర్రపు థాలీ దుంప’లో మాదకద్రవ్యాలున్నాయా? లేదా అని పరిశోధనకు పంపాలని పోలీసులు నిర్ణయించారు. కొడైకెనాల్‌(Kodaikanal) కవుంజి, పూండి తదితర ప్రాంతాల్లో ఈ దుంప సాగవుతోంది. ఈ దుంపను రాయిపై రుద్ది ముద్దగా చేస్తే, ఈ ముద్ద నుంచి వచ్చే వాసన కారణంగా మెదడు చురుగ్గా పనిచేస్తుందంటారు. పూండికి చెందిన రాజా అనే వ్యక్తి కొడైకెనాల్‌ వచ్చే పర్యాటకులకు ఈ దుంపలు విక్రయించేవాడు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: పొంగల్‌ ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..


ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన కేరళ యువకులు ఈ దుంప కొనుగోలు వీడియోగా తీసి, ఈ దుంప వాసన చూస్తే మత్తులో జోగుతామంటూ వ్యాఖ్యలు జతచేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ చూసిన కొడైకెనాల్‌ ఎక్సైజ్‌ పోలీసులు(Kodaikanal Excise Police) మంగళవారం రాజాను పిలిపించి విచారించారు. అలాగే, ఈ దుంపలో మాదక ద్రవ్యం ఉందా అనే విషయ నిర్ధారణకు, పూండి ప్రాంతంలో పండించిన దుంప నమూనా సేకరించి చెన్నై(Chennai)లోని ల్యాబ్‌కు పంపారు. ఫలితాల ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 01:55 PM