Share News

Karnataka Home Minister: మహిళలకు కర్ణాటక హోంమంత్రి క్షమాపణ

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:15 AM

బెంగళూరు వంటి మహానగరాల్లో లైంగిక దౌర్జన్యాలు సాధారణం’’ అని వ్యాఖ్యానించిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని, మహిళలకు బాధ కలిగించి ఉంటే క్షమించాలని ఆయన తేల్చిచెప్పారు.

Karnataka Home Minister: మహిళలకు కర్ణాటక హోంమంత్రి క్షమాపణ

బెంగళూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): బెంగళూరు వంటి మహానగరాలలో లైంగిక దౌర్జన్యాలు సాధారణమని వ్యాఖ్యానించిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్‌, మరుసటి రోజునే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని అన్నారు. తాము మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తన వ్యాఖ్యలు మహిళలకు బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరారు. సుద్దగుంటపాళ్యలో ఈనెల 3న నడిచి వెళుతున్న ఇద్దరు యువతులలో ఒకరిని ఆగంతకుడు వెంబడించి కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై సోమవారం మీడియా ప్రశ్నించగా..బెంగళూరులాంటి మహానగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 03:15 AM