Kerala: పెట్రోల్ బంక్‌లో టాయిలెట్‌కు తాళం.. యజమానికి 1.65 లక్షల ఫైన్
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:26 AM
కేరళలో టాయిలెట్ తాళం వేసిన పెట్రోల్ బంక్‌కు వినియోగదారుల ఫోరం రూ.1.65 లక్షల జరిమానా విధించింది. మహిళా ఉపాధ్యాయురాలు జయకుమారి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.

కోజికోడ్, ఏప్రిల్ 8: పెట్రోల్ బంక్‌లో టాయిలెట్‌కు తాళం వేసినందుకు సదరు బంక్ యజమానికి రూ.1.65 లక్షల జరిమానా పడింది. ఈ ఘటన కేరళలో జరిగింది. 2024 మే 8న రాత్రి 11 గంటల సమయంలో పతనంతిట్ట జిల్లాకు చెందిన జయకుమారి అనే ఉపాధ్యాయురాలు కారులో వెళ్తూ కోజికోడ్ జిల్లా పయ్యోలిలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆతర్వాత ఆమె టాయిలెట్‌కోసం వెళ్లగా తాళంవేసి కనిపించింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ టాయిలెట్ తాళం తీసుకుని ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తాళం పగులగొట్టి టాయిలెట్‌ను తెరిపించారు. తర్వాత జయ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. ఫోరం బంక్ యజమానికి రూ.1.65 లక్షల జరిమానా విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు