Presidency University: ఉత్తమ సమాజానికి ఉపాధ్యాయుల పాత్రే కీలకం
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:33 AM
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫౌండర్ చాన్స్‌లర్ డాక్టర్ నిస్సార్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఐదు దశాబ్దాల విద్యారంగ ప్రయాణాన్ని ఉద్ఘాటిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు

ప్రెసిడెన్సీ ఫౌండర్ చాన్స్‌లర్ డాక్టర్ నిస్సార్ అహ్మద్
బెంగళూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ సమాజానికి విద్యార్థులు ముఖ్యమని అయితే వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫౌండర్ చాన్స్‌లర్ డాక్టర్ నిస్సార్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఐదు దశాబ్దాల విద్యారంగంలో ప్రయాణంపై ఇన్‌స్పైర్డ్ 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి అనితా నాయర్, మాజీ ఐపీఎస్ సంజయ్‌సహాయ్, ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ నఫీజా అహ్మద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ, విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని, నిర్మాణాత్మకమైన విద్య అందించే లక్ష్యాన్ని కొనసాగించామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా దీర్ఘ సేవా ప్రశస్తి, అత్యుత్తమ అధ్యాపక పురస్కారం, ఇన్‌స్టిట్యూషనల్ లెగసీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ కౌసర్ నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు.