Kharge Criticizes Bank Charges: బ్యాంకులను కలెక్షన్‌ ఏజెంట్లుగా చేశారు

ABN, Publish Date - Mar 30 , 2025 | 05:12 AM

మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడానికి బ్యాంకులను ‘కలెక్షన్‌ ఏజెంట్లు’గా మార్చిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే విమర్శించారు. బ్యాంకుల చార్జీల పెంపును ధీటుగా తీర్పు ఇచ్చారు

Kharge Criticizes Bank Charges: బ్యాంకులను కలెక్షన్‌ ఏజెంట్లుగా చేశారు

న్యూఢిల్లీ, మార్చి 29: మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడానికి బ్యాంకులను ‘కలెక్షన్‌ ఏజెంట్లు’గా మారుస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే విమర్శించారు. మే 1 నుంచి ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో ఖర్గే ‘ఎక్స్‌’ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ బ్యాంకులు పెంచిన చార్జీల జాబితాను ఆయన జత చేశారు. ప్రజలు తమ పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచనందుకు 2018-2024 మధ్య మోదీ ప్రభుత్వం రూ.43,500 కోట్లు ముక్కు పిండి వసూలు చేసిందని పేర్కొన్నారు. బ్యాంకులు వివిధ చార్జీల పేరిట ప్రజలను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరైనా ఖాతాదారుడు ఏడాదిలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే రూ.100-200, బ్యాంకు స్టేట్‌మెంట్‌ జారీ ఫీజు కింద రూ.50-100, ఎస్‌ఎంఎస్‌ అలెర్ట్‌ల పేరుతో 4 నెలలకు రూ.20-25 చొప్పన, రుణాల మంజూరు సమయంలో 1 నుంచి 3 శాతం ఫీజు వసూలు చేస్తున్నాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 05:14 AM