Tamannaah: పాపం.. ఆ లేడీ కానిస్టేబుల్ క్రేజ్ ముందు తమన్నా వెలవెలబోయింది
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:21 PM
ఒక్కోసారి.. సెలబ్రిటీల కన్నా సామాన్యులకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీలను మించి వారే మీడియా అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నాకు కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..

వకీల్ సాబ్ సినిమాలో ఓ లేడీ పోలీసు అధికారి పాత్ర బాగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆమె పని తీరును ఎద్దేవా చేస్తాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా కాలం పాటు సూపర్ ఉమెన్ పదం బాగా వైరల్ అయ్యింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో రియల్ సూపర్ కాప్ అనే పేరు మార్మోగిపోతుంది. హీరోయిన్ తమన్నాను మించి క్రేజ్ సంపాదించుకుంది ఓ లేడీ కానిస్టేబుల్. లేడీ కాప్ ముందు తమన్నా క్రేజ్ కూడా వెలవెలబోయింది. మరి సదరు కాప్ అంతలా వైరల్ కావడానికి కారణం ఏంటంటే..
ప్రస్తుతం తమన్నా ఓదెల 2 సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ప్రస్తుతం తమన్నా ఓదెల 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం తమన్నా ఎంతో అందంగా రెడీ అయ్యి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్‌లో ఎర్ర గులాబీలా మెరిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. నెటిజనులు తమన్నాను వదిలేసి.. ఓ లేడీ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నారు.
తమన్నా ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తమన్నాకు ఎస్కార్ట్‌గా ఉంది. తమన్నా బయటకు రావడంతోనే ఆ కానిస్టేబుల్ అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. రద్దీగా ఉన్న రోడ్డులో హీరోయిన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంది. పక్కకు, పక్కకు జరగండి.. ప్రతి ఒక్కరు ఓ సైడ్‌కు నడవండి అంటూ లేడీ కానిస్టేబుల్ అరుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ కావడంతో.. సదరు లేడీ కానిస్టేబుల్ పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటే లేడీ పోలీస్ ఆఫీసర్.. విధి నిర్వహణలో ఎంత బాధ్యతగా ఉందో చూడండి.. దటీజ్ ముంబై లేడీ ఆఫీసర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజనుల పుణ్యామా అని హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఆ లేడీ కానిస్టేబుల్.
ఇవి కూడా చదవండి:
US-AP Online Love: హద్దుల్లేని ప్రేమ.. ప్రియుడి కోసం అమెరికా నుంచి ఆంధ్రాకు
Viral Video: నడిరోడ్డుపై భర్త చెంపలు వాయించిన భార్య.. కారణం ఏంటంటే.