Maha Kumbh Mela: 17 రోజుల్లో 15 కోట్ల మంది
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:59 AM
బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని 10కోట్ల మందికి పైగా వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది.

నేడు మౌని అమావాస్య.. 10కోట్ల మంది వస్తారని అంచనా..
మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
మహాకుంభ్ నగర్, జనవరి 28: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 13నుంచి ఇప్పటివరకు 17 రోజుల్లో 15 కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని 10కోట్ల మందికి పైగా వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఈ పర్వదినం నాడు ఉదయం 6.45 గంటలకు హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 26 వరకూ కొనసాగే ఈ మహా కుంభమేళాలో 45కోట్ల మందికి పైగా తరలివస్తారని అంచనా. మరోవైపు, కుంభమేళాకు వచ్చేవారందరికీ అంతరాయం లేని కాల్స్‌తో పాటు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి టెలికాం కంపెనీలు 92 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేశారు. 328 కొత్త టవర్లు ఏర్పాటు చేశారు.