Chamoli Avalanchi: ఆరుకు చేరిన మృతులు.. చివరి ఇద్దరి కార్మికుల కోసం గాలింపు
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:34 PM
వరుసగా రెండో రోజు జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆదివారంనాడు డెహ్రాడూన్‌లోని ఐటీ పార్క్ వద్దనున్న డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు సీఎం వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.

చమోలి: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోన చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడి అందులో చిక్కుకున్న కార్మికుల వెలికితీత ఆపరేషన్ ఆదివారంనాడు రెండోరోజుకు చేరుకుంది. తాజాగా మరో రెండు మృతదేహాలను ఆర్మీ వెలికితీసింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. తక్కిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మంచు తొలగించే పనుల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేష్ (BRO) కార్మికులు ఉండగా మంచు చరియలు విరిగిపడి 54 మంది అందులో కూరుకుపోయారు. వెంటనే ఆర్మీ, సహాయక బృందాలు రంగంలోకి దిగి 50 మందిని కాపాడారు. వారిని ఎయిర్‌లిఫ్ట్‌తో ఆసుపత్రులకు జోషి మఠ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలతో నలుగురు కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం మరో రెండు మృతదేహాలను మంచి పెళ్లల కింద నుంచి వెలికితీశారు.
Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్
దీనికి ముందు 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయినట్టు వార్తలు వచ్చినప్పటికీ ఒక కార్మికుడు లీవుపై ఇంటిలో ఉన్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించారు. దీంతో 54 మంది కార్మికులు లెక్కకు తేలారు. వీరిలో 50 మందికి రక్షించామని, మరో ఐదుగురు మంచులో చిక్కుకోవడంతో వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు జోషిమఠ్ నుంచి మరో ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుంది. థర్మల్ ఇంజన్ కెమెరా సాయంతో మంచులో చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.
వరుసగా రెండో రోజు జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆదివారంనాడు డెహ్రాడూన్‌లోని ఐటీ పార్క్ వద్దనున్న డీజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు సీఎం వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. మొత్తం 54 మందిలో నలుగురు కార్మికుల జాడ ఇంకా తెలియాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గాలింపు చర్యలకు సహకరించేందుకు స్నైపర్ డాగ్స్‌ను కూడా రంగంలోకి దింపారు. లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్‌గుప్తా, మరో లెఫ్టినెంట్ జనరల్ డీజీ మిశ్రా ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తు్న్నారు. ఆర్మీకి చెందిన 3 ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 2, మరో సివిల్ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కాగా, ఇప్పటికీ జాడ తెలియకుండా పోయిన వారిలో హిమాచల్ ప్రదేశ్‌కు చెదిన హర్మేష్ చాంద్, యూపీకి చెందిన అశోక్, ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ కుమార్, అరవింద్ సింగ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి
Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.