Train Track Stunt: ఏం పోయేకాలం రా నాయనా.. రీల్స్ కోసం ఇంత దిగజారాలా
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:51 AM
ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఏకంగా రైలు పట్టాలపై.. ట్రైన్ తన మీదుగా వెళ్లే దృశ్యాలను రికార్డ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత కొందరు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. ఎంతో టాలెంట్ ఉండి గుర్తింపు లేని వారికి సోషల్ మీడియా సంజీవనిగా ఉపయోగపడింది. అయితే దీని వల్ల లాభం ఎంత ఉందో.. నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే.. వార్నీ అనిపించకమానదు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకు వేసి.. ప్రాణాలు పణంగా పెట్టి మరీ సాహసాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం రైలు పట్టాల మీద పడుకుని వీడియో తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, ఉన్నావోలో చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఏకంగా రైలు పట్టాల మీద పడుకుని.. వీడియో తీశాడు. రంజిత్ చౌరాసియా అనే వ్యక్తి ఈ పని చేశాడు. ఉన్నావో హసరంగంజ్ ప్రాంతానికి చెందిన రంజిత్.. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్ పొందడం కోసం ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. కుసుంభి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల మీద పడుకుని వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు.
ఆ తర్వాత తన మీదుగా రైలు వెళ్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. రైలు వెళ్లిపోయిన తర్వాత పట్టాల మీద నుంచి లేచి చక్కా పోయాడు. ఆ తర్వాత వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రీల్స్ కోసం ఇతకు దిగజారాలా అని నెటిజనులు మండి పడ్డారు. విషయం కాస్త రైల్వే పోలీసుల దృష్టికి చేరడంతో..వారు రంగంలోకి దిగారు. రంజిత్‌ను అరెస్ట్ చేశారు.
ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజనులు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేసే వారి మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Shiva Temple: సైంటిస్టులకే సవాల్.. 3 వేల ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం..