Share News

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:26 AM

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ లకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. డీఆర్‌జీ సైనికుడు మృతి చెందినట్టు సమాచారం. అభూజ్‌మడ్‌ అడవుల్లో 12 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..
Encounter

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ జిల్లా (Narayanapur District)లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. మావోయిస్ట్ లకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. డీఆర్‌జీ (DRG ) సైనికుడు మృతి చెందినట్టు సమాచారం. అభూజ్‌మడ్‌ అడవుల్లో 12 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.. కాగా అభూజ్ మడ్ అడువులను దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్ బలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్ లో వేల సంఖ్యలో డీఆర్‌జీ, ఎస్‌టిఎఫ్, కోబ్రా సిబ్బంది పాల్గొన్నారు. అభూజ్ మడ్ అడువుల్లో ప్రత్యేక దళాలు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. కూంబింగ్ చేపడుతున్న బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కాగా మూడు వారాల క్రితం నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. జగదల్ పూర్, నారాయణపూర్, దంతెవాడ, కొండగావ్, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో వారికి మావోలు ఎదురపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఎదురు కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహించగా.. మావోలు తారసపడ్డారని, ఈ మేరకు జరిగిన ఎదురుకాల్పుల్లో వారు మృతిచెందినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

కాగా, మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు నవంబర్ 22న చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.


తెలంగాణలోనూ..

గత డిసెంబర్ 1న తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరగగా.. ఏడుగురు మావోలు మృతిచెందారు. ఎదురు కాల్పుల్లో ఇల్లందు- నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు సహా కీలక నేతలు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. టీఎస్‌సీఎం ఇల్లందు-నర్సంపేట సెక్రటరీ కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం- మహదేవ్‌పూర్ డీవీసీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేశ్‌లు పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం

కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి ఆత్మహత్య..

గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్

ముప్పే... బాబూ!

వైసీపీ మాదిరి హీరోలను రప్పించం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 09:26 AM