Share News

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:11 PM

మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. భండార జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరిని రిస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

మహారాష్ట్ర (Maharashtra)లో భారీ పేలుడు (Massive explosion) సంభవించింది. భండార జిల్లా (Bhandara District)లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి (Five killed) చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నాగ్ పూర్ డిఫెన్స్ పిఆర్వో ఈ పేలుడు ఘటనపై అధికారిక ప్రకటన చేశారు. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలోచాలా మంది చిక్కుకుపోయారు. అందులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని భండార జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే డాక్టర్లను ఆదేశించారు.ఇప్పటివరకు మొత్తం పద్నాలుగు మందిని రక్షించినట్లు కలెక్టర్ తెలిపారు.


శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వర్కర్లు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని చెప్పారు. భారీగా పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ దృశ్యాల‌ను దూరాన ఉన్న కొంద‌రు త‌మ కెమెరాల్లో బంధించారు. కాగా భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ‘‘ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం’’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి

మీర్‌పేట్ హత్య కేసులో సంచలన విషయాలు...

మహేంద్ర షో రూమ్‌లో అగ్నిప్రమాదం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 24 , 2025 | 01:23 PM