Defamation Case: మేధా పాట్కర్ ప్రొబేషన్‌పై విడుదల
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:56 AM
పరువు నష్టం కేసులో జైలు శిక్ష పడిన మేధా పాట్కర్‌కు కోర్టు ఊరట ఇచ్చింది. సత్ప్రవర్తనను గుర్తించి ఆమెను ప్రొబేషన్‌పై విడుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ (70)కు మంగళవారం న్యాయస్థానంలో ఊరట లభించింది. పరువు నష్టం దావాలో జైలు శిక్ష పడిన ఆమెను ప్రొబేషన్‌పై విడుదల చేస్తున్నట్టు అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ప్రకటించారు. సత్ప్రవర్తనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఢిల్లీ గవర్నర్ ఎల్.కె.సక్సేనా నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ సమయంలో ఆమెపై ఈ పరువు నష్టం దావా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు