Nagpur: 15 ఏళ్లుగా 50కి పైగా అమ్మాయిలను చెరబట్టి!
ABN, Publish Date - Jan 16 , 2025 | 06:27 AM
అతడొక సైకాలజిస్టు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు కూడా.. వయసు 45 ఏళ్లు.. దాదాపు 15 ఏళ్లుగా అతడి ఇంటి వద్దే క్లినిక్ నిర్వహిస్తూ చాలా మంది విద్యార్థినులకు క్లాసులు తీసుకుంటూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
నాగ్‌పూర్‌లో సైకో సైకాలజిస్టు అరెస్టు..
నాగ్‌పూర్, జనవరి 15: అతడొక సైకాలజిస్టు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు కూడా.. వయసు 45 ఏళ్లు.. దాదాపు 15 ఏళ్లుగా అతడి ఇంటి వద్దే క్లినిక్ నిర్వహిస్తూ చాలా మంది విద్యార్థినులకు క్లాసులు తీసుకుంటూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో నాగ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సమీప హాస్టళ్లలో ఉంటూ క్లాసులకు వచ్చే వారు.. అయితే కొన్ని వారాల క్రితం ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడి అసలు బండారం బయటపడింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న అతగాడి కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది.
దాదాపు 15 ఏళ్లుగా 50 మందికి పైగా అమ్మాయిల్ని క్లాసుల పేరుతో రప్పించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వాడుకోవడం, ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సాయంత్రం తర్వాత క్లాసుల పేరుతో అమ్మాయిలను క్లినిక్‌కు రప్పించే అతడు.. రాగానే వారికి రంగు లేని ఓ ద్రావణాన్ని ఇచ్చేవాడు.. అది తాగి స్పృహ కోల్పోయిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలు తీసుకునే వాడు.. ఆ తర్వాత వారిని బెదిరింపులకు గురి చేస్తూ లైంగికంగా వాడుకునేవాడు.. చివరికి ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించిన భార్య, మరో మహిళ పరారీలో ఉన్నారు.
Updated Date - Jan 16 , 2025 | 06:27 AM