BJP-JDU: మద్దతు ఉపసంహరణపై జేడీయూ యూటర్న్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు

ABN, Publish Date - Jan 22 , 2025 | 06:55 PM

మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది

BJP-JDU: మద్దతు ఉపసంహరణపై  జేడీయూ యూటర్న్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు

పాట్నా: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ (Rajiv Ranjan Prasad) వివరణ ఇచ్చారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండా మణిపూర్ జేడీయూ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు క్షేత్రమయుం బీరేన్ సింగ్ సొంతంగా ప్రకటన చేసినట్టు చెప్పారు. బీరేన్‌సింగ్‌ను క్రమశిక్షణారాహిత్యం కింద పదవి నుంచి తొలగించినట్టు వెల్లడించారు.

AAP Health Scam: ఆప్ హెల్త్ స్కామ్, రూ.382 కోట్ల అవినీతి: కాంగ్రెస్


దీనికి కొద్ది నిమిషాలకు ముందే మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపంసహరించుకున్నట్టు క్షేత్రమయుం బీరేన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి తమ మద్దతు ఉండదని, జేడీయూ ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ఇక నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని తెలిపారు. మణిపూర్‌లో బీజేపీ సారథ్యంలోని కూటమిలో 2022 నుంచి జేడీయూ భాగస్వామిగా ఉంది. అప్పట్ని ఎన్నికల్లో జేడీయూ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలుపొందగా, ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ సారథ్యంలోని బీజేపీలో చేరిపోయారు.


కాగా, ఇటు బీహార్‌లోనూ, అటు కేంద్రంలోని ఎన్డీయేలోనూ నితీష్ కుమార్ జేడీయూ భాగస్వామిగా ఉంది. దీనికితోడు బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌కు జేడీయూ మద్దతు ఉపసంహరించుకందంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రకటించడం సంచలనమైంది. దీంతో కొద్దిసేపటికే జేడీయూ అధినాయకత్వం అలాంటిదేమీ లేదంటూ వివరణ ఇచ్చుకుంది.


ఇది కూడా చదవండి..

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు

influential Indians : సత్యం.. సుందరం!

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 22 , 2025 | 06:55 PM