Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:28 PM
ఎటువంటి కలుషితం లేకుండా ఆవిరితో తయారయ్యే ఇడ్లీ(Idli) ఆరోగ్యానికి ఎంతో మేలని అందరూ భావిస్తారు. కానీ ఇటీవల ఇడ్లీ ద్వారా క్యాన్సర్ ప్రభావం పెరుగుతోందనే అంశం బహిరంగం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీ పార్సిళ్లకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.

- ప్లాస్టిక్‌తో క్యాన్సర్ ప్రేరేపించే రసాయనాలు
- ఉల్లంఘిస్తే కఠినచర్యలు... హోటళ్లు నిబంధనలు పాటించాలి
- వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దినేష్‌గుండూరావ్ ఆదేశాలు
బెంగళూరు: ఎటువంటి కలుషితం లేకుండా ఆవిరితో తయారయ్యే ఇడ్లీ(Idli) ఆరోగ్యానికి ఎంతో మేలని అందరూ భావిస్తారు. కానీ ఇటీవల ఇడ్లీ ద్వారా క్యాన్సర్ ప్రభావం పెరుగుతోందనే అంశం బహిరంగం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీ పార్సిళ్లకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ఇడ్లీ పార్శిళ్ళకు ఎటువంటి ప్లాస్టిక్ పేపర్‌లను వాడరాదని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దినేష్‌గుండూరావ్(Minister Dinesh Gundu Rao) వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Road Roller: వార్నీ.. వీళ్లు ఏకంగా ‘రోడ్ రోలర్’నే దొంగిలించేశారుగా..
గురువారం బెంగళూరు(Bengaluru)లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఇడ్లీలను గుడ్డలు ఉపయోగించి మాత్రమే తయారు చేయాలని సూచించారు. వేడి ఇడ్లీని ప్లాస్టిక్ పేపర్ ద్వారా పార్శిల్ చేయడం ద్వారా క్యాన్సర్(Cancer)ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలిందన్నారు. ఇటీవల నగర వ్యాప్తంగా బెంగళూరు మహానగర పాలికె(Bangalore Metropolitan Municipality) ఆహార సంరక్షణా విభాగం అధికారులు దాడులు జరిపారు.
500 ఇడ్లీలను సేకరించగా వీటిలో 35 ఇడ్లీలు అత్యంత ప్రమాదకరమని నిర్ధారించారన్నారు. ప్లాస్టిక్ పేపర్ ఉపయోగించి ఇడ్లీ తయారు చేసినా, వేడి ఇడ్లీ పార్శిల్ చేసినా ప్రమాదకరమనే అంశాన్ని శాస్త్రవేత్తలు వివరించిన మేరకు వైద్య ఆరోగ్యశాఖ తీసుకునన్న నిర్ణయాలకు కట్టుబడాలని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీల తయారీలో కానీ పార్శిల్‌కు కానీ ప్లాస్టిక్ పేపర్‌లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News