Share News

Bengaluru: రాష్ట్ర బంద్‌కు సిద్ధమైన ఒక్కలిగలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:50 PM

కర్ణాటక రాష్ట్ర బంద్‏కు ఒక్కలిగ సంఘం సిద్దమవుతోంది. కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంద్‏కు పిలుపునిచ్చేందుకు నిర్ణయించింది. అలాగే.. ఒక్కలిగలకు అన్యాయం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. దీన్ని నిరసిస్తూ.. త్వరలో రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Bengaluru: రాష్ట్ర బంద్‌కు సిద్ధమైన ఒక్కలిగలు

బెంగళూరు: కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ ఒక్కలిగ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని సంఘం అధ్యక్షుడు కెంచప్ప గౌడ(Kencheppa Gouda) హెచ్చరించారు. బుధవారం ఒక్కలిగ సంఘం అత్యవసరంగా సమావేశమైంది. కులగణన నివేదిక సమంజసంగా లేదని అధ్యక్షుడు కెంచప్పగౌడ మండిపడ్డారు. పదేళ్లక్రితం నాటి నివేదికను ఇప్పుడు ఎలా అంగీకరించాలని ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: అయోధ్య బాల రాముడికి వెండి కిరీటం


ఒక్కలిగలను 61లక్షల మంది మాత్రమే చూపారన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు తాలూకాల వారీగా పరిశీలించామని, ఒక్కలిగల జనాభా ఎంత అనేది స్పష్టంగా తేల్చలేదన్నారు. ఒక్కలిగలకు అన్యాయం చేసేందుకు కుట్ర సాగుతోందన్నారు. అందరం కలసి కర్ణాటక బంద్‌(Karnataka Bandh) చేస్తామన్నారు. అన్యాయానికి గురైన వారంతా కలసిరావాలన్నారు.


pandu2.4.jpg

వీరశైవ సముదాయానికి చెందినవారితోనూ పోరాటంపై మాట్లాడతామన్నారు. ఒక్కలిగసంఘం ప్రధాన కార్యదర్శి కోనప్పరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఈనెల 17న కేబినెట్‌ నిర్ణయం తర్వాత తమ పోరాటంపై స్పష్టత ఇస్తామన్నారు. కర్ణాటక బంద్‌ చేపడ్తామని తేల్చి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 01:50 PM