Raj Thackeray: సమస్య వస్తే గుర్తొస్తాం.. ఓటు వేసేటప్పుడు విస్మరిస్తున్నారు: రాజ్ ఠాక్రే
ABN, Publish Date - Jan 01 , 2025 | 06:10 PM
ముంబైలో గత 25 ఏళ్లుగా మార్పులు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగావకాశాలు లేవనే అభద్రతా భావంతో ప్రజలు ఉన్నారని రాజ్ ఠాక్రే చెప్పారు. యువకులకు చేసేందుకు పని లేదని, ఇదే సమయంలో రాష్ట్రం బయట నుంచి వచ్చిన వారికి ఉద్యోగావకావశాలు లభిస్తున్నాయని రాజ్ ఠాక్రే అన్నారు.
ముంబై: ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారంకోసం తమ పార్టీ వైపు చూస్తారని, ఎన్నికల్లో ఓటింగ్ సమయంలో మాత్రం విస్మరిస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు వరుస ట్వీట్లలో ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
Vinod Kambli: ఆసుపత్రి నుంచి వినోద్ కాంబ్లి డిశ్చార్జి
ముంబైలో గత 25 ఏళ్లుగా మార్పులు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగావకాశాలు లేవనే అభద్రతా భావంతో ప్రజలు ఉన్నారని రాజ్ ఠాక్రే చెప్పారు. యువకులకు చేసేందుకు పని లేదని, ఇదే సమయంలో రాష్ట్రం బయట నుంచి వచ్చిన వారికి ఉద్యోగావకావశాలు లభిస్తున్నాయని అన్నారు. కార్మికుల నుంచి రైతులు, పేదల వరకు చుక్కలనంటుతున్న ధరలతో కుదేలవుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ, ఇతర సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేవ గురొస్తుందని, కానీ ఎన్నికల్లో ఓటింగ్ సమయంలో మాత్రం పార్టీని విస్మరిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఇప్పటికీ తాము విశ్లేషించుకుంటున్నామని, త్వరలోనే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 125 మంది అభ్యర్థులను ఎంఎన్ఎస్ పోటీకి దింపింది. అయితే ఒక్క సీటు కూడా పార్టీ గెలుచుకోలేదు. 1.55 శాతం ఓటింగ్ షేర్ రాబట్టుకుంది. మహిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కేవలం మూడో స్థానంలో నిలిచాడు. ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని రాజ్ ఠాక్రే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎన్‌ఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానం దక్కించుకుంది. ఈసారి ఖాతా కూడా తెరవలేదు.
ఇవి కూడా చదవండి..
PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు
UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య
Updated Date - Jan 01 , 2025 | 06:10 PM