Share News

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

ABN , Publish Date - Jan 15 , 2025 | 01:24 PM

ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల్లో 40కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తొలి రోజు... మకర సంక్రాంతినాడే కోటిన్నర మంది భక్తులు ఈ కుంభమేళాకు వచ్చినట్లు అంచనా. మహాకుంభమేళా 45 రోజులు జరిగినా... ఆరు రోజులను..

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా గ్రాండ్‌గా జరుగుతోంది. మొదటి రెండు రోజులు మూడన్నర కోట్ల మందికిపైగా త్రివేణిసంగమంలో అమృత స్నానాలు ఆచరించారు. ఒకవేళ మీరు మహాకుంభ్‌కు వెళ్తున్నారా. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల్లో 40కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తొలి రోజు... మకర సంక్రాంతినాడే కోటిన్నర మంది భక్తులు ఈ కుంభమేళాకు వచ్చినట్లు అంచనా. మహాకుంభమేళా 45 రోజులు జరిగినా... ఆరు రోజులను పరమపవిత్ర మైనవిగా భావిస్తారు. ఆ రోజుల్లో రోజుకు కోటిన్నర నుంచి మూడు కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. దీంతో మీరు ఆ రోజుల్లో మహాకుంభ్‌కు వెళ్తున్నారా అనే విషయం తెలుసుకోవాలి.


జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26 మహా శివరాత్రికావడంతో.. ఆ రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజులను గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలి.


పిల్లలతో వెళ్తున్నారా..

కుంభమేళాకు వెళ్లే భక్తులు తప్పిపోయే ఛాన్స్‌ ఎక్కువ. పిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా ఓటరు ఐడీ లేదా ఆధార్‌ కార్డ్‌ దగ్గర పెట్టుకోవాలి. పిల్లలైతే ఫోన్‌ నంబర్ రాసి పెట్టుకోవడం ఉత్తమం. గంగా నదిలో స్నానమాచరించే సమయంలో జన సమూహం ఎక్కువగా ఉంటే కొంచెం దూరంగా ఉండటం ఉత్తమం. హెచ్చరికల బోర్డులు దాటి లోనికి వెళ్లడం మంచిదికాదని గుర్తించాలి. దారి కోసం గూగుల్‌ మ్యాప్స్‌‌ ఉపయోగించుకోవచ్చు. ఐఎండీ వెదర్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికపప్పుడు ఇస్తోంది. వాటిని ఫాలో అయితే వాతావరణ పరిస్థితులు తెలుుకోవచ్చు. అసలే చలికాలం కావడంతో విపరీతమైన చలి ఉంటుంది. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాగ్‌రాజ్‌లో బస చేయాలనుకునేవారు ముందుగానే రూం, కాటేజ్‌ లాంటివి బుక్‌ చేసుకోవాలి. అక్కడికి పోయాక చూసుకుందాంలే అనుకుంటే, భారీగా డబ్బు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ బెటర్.


ఆహారం విషయంలో..

కుంభమేళాలో చాలా సేపు నడవాల్సి రావచ్చు. వాటర్ బాటిల్‌, ఫుడ్‌ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. శానిటైజర్‌, మాస్క్‌ వెంట తీసుకెళ్లాలి. భారీ జన సమూహాల్లో ఏమైనా జరగొచ్చు. మిగతా ఉత్సవాల కన్నా కుంభమేళాకు తెలంగాణ , ఏపీ నుంచి భక్తుల స్పందన తక్కువుగానే ఉంటుంది. తెలంగాణ నుంచి 3 లక్షల మంది,. ఏపీ నుంచి అంతకన్నా కొంచెం ఎక్కువమంది దర్శించుకునే ఛాన్స్‌ ఉంది. ఈ కుంభమేళాకు కోట్లాది మంది వస్తుండటంతో మోసాలు చేసేవారూ ఉంటారు. సైబర్‌ నేరగాళ్లు చెలరేగే ప్రమాదముంది. అందుకే సైబర్‌ నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. నాగ సాధువుల భజనలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఊరేగింపులుంటాయి. రద్దీ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. 4 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో త్రివేణి సంగమ తీరంలో అతిపెద్ద టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ... మహాకుంభ్‌ యాత్రను పూర్తిచేసుకోవాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 15 , 2025 | 01:25 PM