Share News

Modi in Sri Lanka: 3రోజుల పర్యటనకు శ్రీలంక చేరుకున్న మోదీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:35 AM

ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు శ్రీలంక చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతూ, శ్రీలంక అధ్యక్షుడితో కీలక ఒప్పందాలు కుదుర్చే అవకాశం ఉం

Modi in Sri Lanka: 3రోజుల పర్యటనకు శ్రీలంక చేరుకున్న మోదీ

కొలంబో, ఏప్రిల్‌ 4: ప్రధాని మోదీ శ్రీలంక చేరుకున్నారు. బ్యాంకాంక్‌లో బిమ్‌స్టెక్‌ సదస్సు పూర్తి చేసుకుని కొలంబో చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో శ్రీలంక మంత్రులు ఘన స్వాగతం పలికారు. 3రోజుల పర్యటనలో భాగంగా మోదీ శ్రీలంక అధ్యక్షుడు అనురతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, డిజిటల్‌, ఇంధన భద్రత తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా భారత సహకారంతో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. శాంపూర్‌ సౌరశక్తి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. 6న మోదీ దిస్సనాయకేతో కలిసి అనురాధపురాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శిస్తారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:36 AM