Allahbadia Remarks Row: అల్హాబాదియా ఇంటికి తాళం..రిక్త హస్తాలతో పోలీస్ టీమ్‌లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:55 PM
తన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని రణవీర్ అల్హాబాదియా ఇటీవల ఒప్పుకున్నారు. అందులో అందులో ఎలాంటి హాస్యం లేదని, తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదని అన్నారు. తాను మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ అనుభవం నేర్పిందని చెప్పారు.

ముంబై: యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) 'ఇండియా గాట్ లాటెంట్'లో చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. దర్యాప్తులో భాగంగా ముంబై, అసోం పోలీసులు శుక్రవారంనాడు అతని నివాసానికి వెళ్లారు. అయితే అతని ఇంటికి తాళం వేసి ఉన్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Ranveer Allahbadia: సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ అల్హాబాదియా
''వర్సోవాలోని అల్హాబాదియా ఫ్లాట్‌కు ముంబై, అసోం పోలీస్ బృందాలు ఈరోజు ఉదయం వెళ్లాయి. తాళం వేసి ఉండటంతో రెండు టీమ్‌లు ఖర్ పోలీస్ స్టేషన్‌కు వెనుదిరిగి వచ్చేశాయి'' అని పోలీసులు తెలిపారు. గురువారంనాడు ఖర్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన గైర్హాజర్ అయ్యారని, దీంతో శుక్రవారంనాడు హాజరుకావాలని రెండోసారి సమన్లు పంపామని చెప్పారు. తన నివాసంలోనే స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని అల్హాబాదియా కోరారని, అయితే ఆయన అభ్యర్థనను నిరాకరించినట్టు తెలిపారు.
'ఇండియా గాట్ లాటెంట్'లో అశ్లీలాన్ని ప్రమోట్ చేస్తూ డిస్కషన్లు జరుగుతున్నాయంటూ అల్హాబాదియా సహా పలువురిపై గౌహతి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఫిబ్రవరి 11న తెలిపారు. బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమన్ (ప్రొహిబిషన్) యాక్ట్ 1986లోని వివిధ సెక్షన్లత సహా సైబర్ పీసీ కేసును గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా అసోం పోలీసుల బృందం బుధవారం ముంబై వచ్చింది. ఖర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీనియర్ పోలీసు అధికారులను కలుసుకుంది. కాగా, మహారాష్ట్ర సైబర్ సైతం ఈ కేసుకు సంబంధించి సుమారు 50 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. వీరిలో 'ఇండియా గాట్ లాటెంట్' షోకు హాజరైన పలువురు ఉన్నారు. అపూర్వ ముఖిజ అలియాస్ రెబల్ కిడ్, రణవీర్ అల్హాబాదియా మేనేజర్, నటుడు రఘురామ్ సహా ఏడుగురి వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు రికార్డు చేశారు.
కాగా, వివాదంపై ఇప్పటికే అల్హాబాదియా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని ఒప్పుకున్నారు. అందులో అందులో ఎలాంటి హాస్యం లేదని, తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదని అన్నారు. తాను మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ అనుభవం నేర్పిందని చెప్పారు. తనను క్షమించాలని వేడుకున్నారు. ఈ క్రమంలోనే తనపై వివిధ రాష్ట్రాల్లో ఎఫ్ఐఅర్‌లు నమోదైనందున వాటన్నింటినీ క్లబ్ చేయాలని కోరుతూ అల్హాబాదియా సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి...
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.