Share News

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:13 AM

PM Modi: దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నట్లు తెలిపారు.

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
PM Narendra Modi

న్యూఢిల్లీ, జనవరి 31: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రసంగిస్తున్నారు. అనంతరం లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narender Modi) మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.


ఈరోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తొలి విడతలో మొత్తం 9 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే మలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు జరుగుతాయి. మలి విడతలో మొత్తం 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఉంటుంది. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు లోకసభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం( ఫిబ్రవరి 3) ఉభయసభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ జరుగనుంది.


ఇవి కూడా చదవండి...

శీతాకాల సభల్లో సెగలే!

అమరావతికి ఓఆర్‌ఆర్‌ మణిహారం!

Read Latest National News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 11:19 AM