Ranveer Allahbadia: సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ అల్హాబాదియా
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:41 PM
యూట్యూబ్ షో 'ఇండియా గాట్ లాటెంట్'లో జడ్జీగా హాజరైన అల్హాబాదియా అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. ఈ షోకు హాజరైన ఓ వ్యక్తిన తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్నించడం ఒక్కసారిగా వివాదమైంది.

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో తనపై ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఒకేచోట చేర్చి విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. గౌహతి పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్‌కు కూడా అభ్యర్థించారు. ముందస్తు విచారణ జరిపాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికే కేటాయించిన తేదీకే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
Mamata Kulakarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ
యూట్యూబ్ షో 'ఇండియా గాట్ లాటెంట్'లో జడ్జీగా హాజరైన అల్హాబాదియా అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. ఈ షోకు హాజరైన ఓ వ్యక్తిన తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్నించడం ఒక్కసారిగా వివాదమైంది. దీనిపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఘాటుగా స్పందించారు. తాను ఆ షో చూడనప్పటికీ తనకు సమాచారం అందిందని, షోలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని సీఎం అన్నారు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఇతరుల స్వేచ్ఛను హరించేలా అంది ఉండకూడదని అన్నారు. పరిమితులు దాటితే చర్చలు తప్పవని హెచ్చరించారు.
పోలీసుల ఎఫ్ఐఆర్, సీఎం హెచ్చరికలతో అల్హాబాదియా వెంటనే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని ఒప్పుకున్నారు. అందులో అందులో ఎలాంటి హాస్యం లేదని, తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదని అన్నారు. తాను మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ అనుభవం నేర్పిందని చెప్పారు. తనను క్షమించాలని వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.