Ravi Mohan: నన్ను అసలు పేరుతోనే పిలవండి ప్లీజ్..
ABN, Publish Date - Jan 14 , 2025 | 10:09 AM
‘జయం’ చిత్రంతో ‘జయ రవి’ ప్రసిద్ధి చెందిన రవి తన అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సహాలతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ఈ మంచి తరుణంలో తనను జయం రవి పేరుతో కాకుండా, రవి లేదా రవి మోహన్(Ravi Mohan) పేరుతో పిలవాలని కోరారు.
- రవి మోహన్
చెన్నై: ‘జయం’ చిత్రంతో ‘జయ రవి’ ప్రసిద్ధి చెందిన రవి తన అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సహాలతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ఈ మంచి తరుణంలో తనను జయం రవి పేరుతో కాకుండా, రవి లేదా రవి మోహన్(Ravi Mohan) పేరుతో పిలవాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను జయం రవి(Jayam Ravi) అని పిలవొద్దని, రవి లేదా రవి మోహన్ అని పిలవాలని కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: వామ్మో.. మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
అలాగే, చిత్రపరిశ్రమపై తనకున్న ఎల్లలు లేని అభిమానానికి గుర్తుగా ‘రవి మోహన్ స్టూడియోస్’(Ravi Mohan Studios) అనే పేరుతో ఒక సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ బ్యానరులో యంగ్ టాలెంట్, కథా రచయితలు, ఔత్సాహిక దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తామని వెల్లడించారు. అలాగే, తన అభిమాన సంఘం పేరును కూడా ఇక నుంచి ‘రవి మోహన్ అభిమాన సంఘం’గా పేరు మార్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం ఇకపై కూడా కొనసాగించాలని రవి మోహన్ కోరారు.
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Updated Date - Jan 14 , 2025 | 10:09 AM