Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్, షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:12 PM
ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.

న్యూఢిల్లీ: జనవరి 26న భారత 76వ గణతంత్ర దినోత్సవానికి (Republic Day 2025) ముఖ్య అతిథిగా ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రభోవొ సుబియాంతో (Prabowo Subianto) హాజరువుతున్నారు. ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్ కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కర్యవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననుంది.
Mahakumbh: మహాకుంభ్‌కు మోదీ.. ఎప్పుడంటే
రిపబ్లిక్ డే షెడ్యూల్ ఇదే..
రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీస్/డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన 31 శకటాలు పాల్గొంటాయి. జాతీయగీతాలాపన తరువాత భారత రాజ్యాంగ 75వ వార్షిక అధికారిక లోగోతో పాటు బెలూన్లను విడుదల చేస్తారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధ వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. సెరిమోనిల్ బగ్గీలో కర్తవ్యపథ్‌కు రాష్ట్రపతి చేరుకోని గౌరవ వందనం స్వీకరిస్తారు. సాయుధ బలగాలు, పారా మిలటరీ బలగాలు, ఆర్టిలరీ సివిల్ ఫోర్సెస్, ఎన్‌సీసీ, ఎన్‌సీసీ యూనిట్లతో మార్చ్‌ఫాస్ట్ జరుపుతాయి.
ముఖ్య అతిథులుగా వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. సర్పంచ్‌లు, ప్రకృతి వైపరీత్య నిరోధక వర్కర్లు, హ్యాండ్‌లూమ్ కళాకారులు, పారాలింపిక్ కంటింజెంట్, గిరిజన లబ్ధిదారులు తదితరులను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించారు. స్వర్ణ భారత్ నిర్మాతలుగా సమాజానికి విశేష సేవలందిస్తున్న వారిని అతిథులుగా ఎంపిక చేశారు. 'స్వర్ణీం భారత్: విరాసత్ ఔర్ వికాస్' అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి. జనవరి 26న ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్ డే పరేడ్ మొదలవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ 45 నృత్యరీతులను 5000 మందికి పైగా కళాకారులు ప్రదర్శిస్తారు. జనవరి 26 నుచి 31 వరకూ భారత్ పర్వ్ ఫెస్టివల్ నిర్వహణ ఉంటుంది. జనవరి 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీడ్‌తో రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తాయి.
ఇది కూడా చదవండి..
Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ
Hero Vijay: ఆ ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
Read More National News and Latest Telugu News