Sankranti festival: సొంతూళ్లకు వెళ్లేందుకు 1.32 లక్షమంది రిజర్వేషన్
ABN, Publish Date - Jan 10 , 2025 | 10:36 AM
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లకు వెళ్ళి జరుపుకునేందుకు సుమారు 1.32 లక్షలమంది రాష్ట్రరవాణా సంస్థ ప్రత్యేక బస్సుల్లో టికెట్లు రిజర్వుచేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని రవాణా శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు.
- నేటినుండి ప్రత్యేక బస్సులు
చెన్నై: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లకు వెళ్ళి జరుపుకునేందుకు సుమారు 1.32 లక్షలమంది రాష్ట్రరవాణా సంస్థ ప్రత్యేక బస్సుల్లో టికెట్లు రిజర్వుచేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని రవాణా శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేవారికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ సెలవుగా ప్రకటించింది. దీంతో వీరంతా ఆరు రోజులపాటు స్వస్థలల్లో సంక్రాంతి వేడుకలను జరుపుకుని తిరిగి రానున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..
చెన్నై నుండి మొత్తం 14 వేల బస్సులు నడుపనున్నారు. కోయంబేడు, మాధవరం, కిలాంబాక్కం(Koyambedu, Madhavaram, Kilambakkam) బస్‌స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. గురువారం రాష్ట్ర రవాణా సంస్థ వెల్లడించిన వివరాల మేరకు 1.30 లక్షల మంది టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. గత యేడాది కంటే ఈ యేడాది అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు స్వంత వూర్లకు వెళ్లనున్నారని అధికారులు చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 10 , 2025 | 10:36 AM