ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI Report: తిండి ఒక్కటే కాదు గురూ!

ABN, Publish Date - Jan 05 , 2025 | 02:46 AM

భారతీయ కుటుంబ వ్యయ విధానాల్లో గణనీయ మార్పు వచ్చిందని, ఆహారం కంటే ఆహారేతర వస్తువులు, అవసరాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.

ఆహారం కంటే ఇతరత్రాపైనే ఖర్చెక్కువ

భారతీయ కుటుంబాల్లో ట్రెండ్‌: ఎస్బీఐ

న్యూఢిల్లీ, జనవరి 4: భారతీయ కుటుంబ వ్యయ విధానాల్లో గణనీయ మార్పు వచ్చిందని, ఆహారం కంటే ఆహారేతర వస్తువులు, అవసరాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పప్పులు, తృణధాన్యాల వినియోగం 5 శాతానికి పైగా తగ్గిందని పేర్కొంది. ఆహారం కంటే ఆహారేతర వస్తువులపై అధిక వ్యయం అనేది ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాలు, జీవనశైలి వంటి అంశాల వల్ల ప్రాధాన్యతా మార్పులను ప్రతిబింబిస్తోందని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా ఆహారంపై చేస్తున్న ఖర్చులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోందని ఎస్టీఐ నివేదిక పేర్కొంది. ‘గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై ఖర్చు 2011-12లో 52.9 శాతం ఉండగా.. అది 2023-24కు 47.04కు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 42.62 నుంచి 39.68 శాతానికి పడిపోయింది’ అని వివరించింది. కుటుంబాల బడ్జెట్‌లలో ఆహారేతర వస్తువులు అధిక ప్రాధాన్యత దక్కించుకుంటున్నాయని, గ్రామాల్లో వీటి భాగం 47.1 నుంచి 52.96 శాతానికి, పట్టణాల్లో 57.38 నుంచి 60.32 శాతానికి ఎగబాకిందని తెలిపింది. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని, ఆసక్తికరంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కారణంగా కుటుంబ వ్యయాల్లో పన్నులు, సుంకాల వాటా తగ్గిందని, అంతకుముందు పన్ను విధానంతో పోలిస్తే తగ్గిన జీఎస్టీ రేట్ల వలన దుస్తులు, ఫుట్‌వేర్‌పై ఖర్చు తగ్గిందని పేర్కొంది. ఆహారం నుంచి ఆహారేతర వ్యయానికి మార్పు చెందడం మారుతున్న భారత సామాజిక-ఆర్థిక చిత్రాన్ని చూపుతోందని ఎస్టీఐ నివేదిక అభిప్రాయపడింది.

Updated Date - Jan 05 , 2025 | 02:46 AM