Share News

Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

ABN , Publish Date - Feb 16 , 2025 | 09:21 AM

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా పలువురు క్షతగాత్రులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.

 Stampede Incident..  రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..
Stampede In NewDelhi Railway Station

న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్‌ (Railway Station)లో పెను విషాదం (Tragedy) చోటు చేసుకుంది. కుంభమేళా (Kumbh Mela)కు వెళ్లే ప్రయాణీకులు పోటెత్తడంతో రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట (Stampede) జరిగి 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతులలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 14, 15వ ఫ్లాట్ ఫాంపై ఈ దుర్గటన జరిగింది. 14 వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయోగరాజ్ ఎక్స్ ప్రెస్ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడికి చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వరి రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణీకులు 12, 13, 14 ప్లాట్ ఫాంపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి..

అబ్బురపరిచే అద్భుత లోకం


కుటుంబాలకు పరిహారం

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా పలువురు క్షతగాత్రులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రెండు రైళ్లు ఆలస్యంగా రావడం, 15–20 నిమిషాల్లోనే ప్రయాణికులు పెద్దఎత్తున ప్లాట్‌ఫాంపైకి తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.


ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 15 మంది మరణించడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఇంకా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. కుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాలో భాగంగా ఇప్పటివరకు 50 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి

గొంతు కోసినా.. మేకులా బతికింది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 16 , 2025 | 09:21 AM