Share News

State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు

ABN , Publish Date - Jan 22 , 2025 | 01:17 PM

సొంత విమానం, హెలికాఫ్టర్లను(Airplanes, helicopters) కొనుగోలు చేసే ఆలోచన లేదని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఢిల్లీ, ఛత్తీ్స్‏గఢ్‌, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌(Delhi, Chhattisgarh, Maharashtra, Jammu and Kashmir, Gujarat, Madhya Pradesh) తదితర పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు సొంతంగా హెలికాఫ్టర్లున్నాయి.

State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు

- రాష్ట్రప్రభుత్వం ప్రకటన

చెన్నై: సొంత విమానం, హెలికాఫ్టర్లను(Airplanes, helicopters) కొనుగోలు చేసే ఆలోచన లేదని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఢిల్లీ, ఛత్తీస్ ‏గఢ్‌, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌(Delhi, Chhattisgarh, Maharashtra, Jammu and Kashmir, Gujarat, Madhya Pradesh) తదితర పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు సొంతంగా హెలికాఫ్టర్లున్నాయి. ఇవి పలు సమయాల్లో ప్రభుత్వాలకు ఉపయోగపడుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: BJP: గోమూత్రం తాగితే టాస్మాక్‌ విక్రయాలు తగ్గుతాయి...


వరదలు సంభవించిన రోజుల్లో నీటిమునిగిన పంటలను, ప్రాంతాలను విమానంలో ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలిస్తుంటారు. సొంత హెలికాఫ్టర్‌(helicopter) లేని రాష్ట్రాల్లో ప్రవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకొని ఏరియల్‌ వ్యూ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి సొంతంగా విమానం, హెలికాఫ్టర్లు లేవని సమాచార హక్కు చట్టం కింద ఓ పౌరుడు పెట్టిన దరఖాస్తుతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉండగా సొంత విమానం, హెలికాఫ్టర్లను కొనుగోలు చేసే యోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 01:17 PM