Share News

Supreme Court: అవాస్తవిక షరతులతో క్లెయింల నిరాకరణ వద్దు

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:28 AM

ఆచరణ సాధ్యం కాని షరతులనుగా చూపి బీమా కంపెనీలు క్లెయింలను తిరస్కరించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాలసీల్లో నిజాయతీ, పారదర్శకత ఉండాలన్న మార్గదర్శకాన్ని ఈ తీర్పులో నొక్కి చెప్పింది.

Supreme Court: అవాస్తవిక షరతులతో క్లెయింల నిరాకరణ వద్దు

రూల్స్‌ ఉద్దేశం పరిహారం ఎగవేత కాదు

బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: బీమా క్లెయింల చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పాలసీల్లో ఆచరణ సాధ్యం కాని నిబంధనలు, షరతులు పెట్టి, వాటిని పాటించలేదన్న కారణంతో పరిహారం చెల్లింపును తిరస్కరించడం తగదని స్పష్టం చేసింది. పాలసీదారుని చేతిలో లేని కారణాలను సాకుగా చూపించి క్లెయింలను నిరాకరించలేవని పేర్కొంది. వినియోగదారులతో బీమా కంపెనీలు ‘నిజాయతీ, పారదర్శకత’తో వ్యవహరించాలని సూచించింది. ‘పాలసీలో ఆచరణకు సాధ్యం కాని, వాస్తవ రూపంలో సాధించలేని షరతులు, నిబంధనలను విధించి ఉంటే వాటిని అమలు చేయాల్సిన పనిలేద’ని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రల ధర్మాసనం సోహం షిప్పింగ్‌ సంస్థకు సంబంధించిన కేసులో తీర్పునిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 03:28 AM