Tamil Nadu: జైశ్రీరామ్ అనండి.. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
ABN , Publish Date - Apr 13 , 2025 | 08:03 PM
కంబ రామాయణం రాసిన కవిని గౌరవించే క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విద్యార్థులకు చేసిన ఈ అప్పీల్ విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మదురై: తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను తొక్కిపెట్టడాన్ని సుంప్రీంకోర్టు తప్పుపట్టిన గంటల్లోనే ఆ రాష్ట్ర గవర్నర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మధురైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ''జై శ్రీరామ్'' అని నినదించాలని కోరారు. ''కంబ రామాయణం'' రాసిన కవిని గౌరవించే క్రమంలో ఆయన విద్యార్థులకు చేసిన ఈ అప్పీల్ విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డీఎంకే, కాంగ్రెస్ సహా పలువురు గవర్నర్‌పై నిప్పులు కురిపించారు. ఒక మతనాయుడిలా గవర్నర్ ప్రసంగించడం ఏమిటంటూ నిలదీశారు.
Anti-Waqf Act protests: సిల్చర్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం.. పోలీసులపై రాళ్లు
"ఈరోజు మనం శ్రీరాముడి గొప్ప భక్తుడైన కవిని గౌరవించుకుంటున్నాం. జైశ్రీరామ్ అని నేను చెబుతాను..మీరూ చెప్పండి'' అని గవర్నర్ కోరడం ఆ వీడియాలో కనిపిస్తోంది. దీనిపై డీఎంకే ఘాటుగా స్పందించింది. గవర్నర్‌ను ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా అభివర్ణించింది. ఇది దేశ లౌకక విలువలకు వ్యతిరేకమని, గవర్నర్ పదేపదే ఎందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించింది. ఇంకా ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని డీఎంకే ప్రతినిధి ధరణిధర్ నిలదీశారు. "ఆయన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి. దేశ సమాఖ్య సిద్ధాంతాలను ఆయన ఎలా ఉల్లంఘిస్తారో అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు కూడా ఆయన స్థానం ఏమిటో ఆయనకు చూపించింది'' అని అన్నారు.
గవర్నర్ రవి 'శ్రీరామ్' నినాదం అందుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసన్ మౌలానా ప్రశ్నించారు. మత సిద్ధాంతాలను ప్రచారం చేసే ఒక మతనాయకుడిలా గవర్నర్ మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలోనే అత్యున్నత పదవుల్లోని ఒక పదవిలో ఆయన ఉన్నారని, ఒక మతనాయకుడిలా మాట్లాడి దేశాన్ని చిక్కుల్లో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. భిన్న మతాలు, భిన్న భాషలకు భారతదేశం నెలవని, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయమనడం ద్వారా అసమానత్వాన్ని గవర్నర్ ప్రోత్సహిస్తు్న్నారని అన్నారు. గవర్నర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తికి ఇది తగదని, ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా మారారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి