Chennai: సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ఆటకట్టు
ABN, Publish Date - Jan 03 , 2025 | 10:47 AM
నాగర్‌కోయిల్(Nagercoil) సమీపంలో ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీ చేసే ఘటనను విదేశాల నుంచి సీసీ టీవీలో చూసి ఇంటి యజమాని, దోపిడీ దొంగలను తరిమిన వైనం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది.
- విదేశాల నుంచే దోపిడీని అడ్డుకున్న వైనం
చెన్నై: నాగర్‌కోయిల్(Nagercoil) సమీపంలో ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీ చేసే ఘటనను విదేశాల నుంచి సీసీ టీవీలో చూసి ఇంటి యజమాని, దోపిడీ దొంగలను తరిమిన వైనం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. కన్నియాకుమారి(Kanyakumari) జిల్లా కోట్టార్ ప్రాంతానికి చెందిన సలీమ్, మస్కట్‌లో పనిచేస్టున్నారు. కాగా కోట్టార్‌లోని తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి అక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటాడు.
ఈ వార్తను కూడా చదవండి: Train Accident: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ ఆడిన కుర్రాళ్లు.. రైలు ఢీకొని ముగ్గురు..
ఈ క్రమంలో, ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు, మంగళవారం రాత్రి తలుపులు పగులగొట్టి ఇంట్లో చొరబడి బీరువా బద్దలు కొట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ దృశ్యాలను మస్కట్‌లో ఉంటున్న సలీమ్, తన సెల్‌ఫోన్(Cellphone) ద్వారా చూశాడు. ఆయన వెంటనే పక్కింటి వారికి ఫోన్ చేసి, తన ఇంట్లో దొంగలు పడినట్లు తెలిపారు.
వారు బయటకు వచ్చి ‘దొంగ...దొంగ’ అంటూ కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొనేలోపు, దొంగలు ఇంటి వెనుక తలుపు ద్వారా తప్పించుకు పారిపోయారు. ఈ ఘటనపై సలీమ్ కోట్టార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సలీమ్ స్వగ్రామానికి రానున్న నేపథ్యంలో, ఈ ఘటనలో ఏ వస్తువులైనా దొంగిలించారా? అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 10:47 AM