Nagpur tragedy: మరణం తర్వాత ఏం జరుగుతుంది?
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:12 AM
ఆ బాలిక ఓ ప్రైవేటు స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. తండ్రి ఆర్బీఐలో ఉన్నతోద్యోగి.. రీజినల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బాలిక తల్లి గృహిణి. ఈ కుటుంబం నాగపూర్‌లోని ఛత్రపతి నగర్‌లో ఉంటోంది. మృతురాలు ఆ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం గమనార్హం.

తెలుసుకునేందుకు మహారాష్ట్రలో17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
నాగ్‌పూర్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
ఆన్‌లైన్‌లో రాతి కత్తి కొనుగోలు
మణికట్టుపై రెండు క్రాస్ మార్కులు
సహా ఐదు తీవ్రమైన గాట్లు
ఆపై గొంతు కోసుకొని బలవన్మరణం
విదేశీ సంస్కృతులు, చావు గురించి
కొన్నాళ్లుగా గూగుల్‌లో పరిశోధన
బాలిక తండ్రి ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్..
నాగపూర్, జనవరి 28: ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’’ అని తెలుసుకునేందుకు ఓ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక ఓ ప్రైవేటు స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. తండ్రి ఆర్బీఐలో ఉన్నతోద్యోగి.. రీజినల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బాలిక తల్లి గృహిణి. ఈ కుటుంబం నాగపూర్‌లోని ఛత్రపతి నగర్‌లో ఉంటోంది. మృతురాలు ఆ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన వివరాలు, బాలిక ఫోన్లో లభ్యమైన సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా బాలిక ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారింది. గూగుల్‌లో చావు గురించి, విదేశీ సంస్కృతుల గురించీ అదేపనిగా సెర్చ్ చేస్తోంది. ప్రత్యేకించి ఐరోపా ప్రజల సంస్కృతిపై ఆసక్తి ఎక్కువగా ఉన్న ఆమె, తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి సవివరంగా రాసుకుంది.
చావు తర్వాత ఏం జరుగుతుందనేదానిపై వెతుకుతూ.. కొన్ని వారాలుగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో గడుపుతోంది. సోమవారం తెల్లవారుజామున 5:45 గంటలకు బాలిక పడకగదిలోకి ఆమె తల్లి వెళ్లిచూసేసరికి రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి బాలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలిక... కత్తితో తన మణికట్టు మీద రెండు క్రాస్ మార్కులతో సహా ఐదు గాట్లు పెట్టుకుంది. చివరికి గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు ఆమె కర్రపిడితో కూడిన రాతితో తయారుచేసిన కత్తిని వాడింది. ఈ తరహా కత్తులు స్థానికంగా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కొన్నట్లు సమాచారం.