Minister: రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి గవర్నర్ ఉండాల్సిందే..
ABN, Publish Date - Feb 06 , 2025 | 11:19 AM
రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్(Governor) కట్టుబడి వుండాల్సిందేనని రాష్ట్ర న్యాయశాఖామంత్రి రఘుపతి వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించేలా ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన ఎక్స్‌పేజీలో పోస్టు చేశారు.

- మంత్రి రఘుపతి వ్యాఖ్య
చెన్నై: రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్(Governor) కట్టుబడి వుండాల్సిందేనని రాష్ట్ర న్యాయశాఖామంత్రి రఘుపతి వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించేలా ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన ఎక్స్‌పేజీలో పోస్టు చేశారు. దానిపై తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Tamil Nadu Governor RN Ravi) ఎలాంటి సమాధానం చెప్తారని మంత్రి రఘుపతి(Minister Raghupathi) ప్రశ్నించారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP: ముస్లింలు, క్రైస్తవుల కొమ్ముకాస్తున్న డీఎంకే
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించారని, అయితే గవర్నర్ సభా హక్కులను ఉల్లంఘించి, ప్రసంగించకుండానే అసెంబ్లీ నుండి వెళ్లిపోయారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాలకు గవర్నర్లు కట్టుబడి పనిచేయాల్సిందేనన్న న్యాయపరమైన వాస్తవాన్ని ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించారని, ఇందుకు గవర్నర్ ఏమి బదులిస్తారని మంత్రి ప్రశ్నించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News
Updated Date - Feb 06 , 2025 | 11:19 AM