Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 02:47 PM
ముగ్గురు వ్యక్తులు సోడా సేవించి, ఆ తర్వాత మద్యం తాగారు. ఆ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ ముగ్గురు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

గుజరాత్ (Gujarat ) ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ప్రాథమికంగా మద్యం సేవించడంతోనే ఈ మరణాలు సంభవించాయని చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరణించిన వారిలో యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) ఉన్నారు. పోలీసుల ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తులు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించారని అంటున్నారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించి ఒక్కొక్కరు స్పృహ కోల్పోయారు.
చేరుకునేలోపు మృతి
ఈ ముగ్గురు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపు వారు మృతి చెందారు. ప్రారంభ విచారణలో మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షలు తేల్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, FSL (ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ) బృందం, జిల్లా ఎల్సీబీ, ఎస్‌ఓజీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, స్థానిక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
అదే సమయంలో
మృతుల బంధువుల ప్రకారం కనుభాయ్ చౌహాన్ జవహర్ నగర్ గేటు సమీపంలో ఉండేవారని, అతనికి మద్యం అలవాటు ఉందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం కూడా, అతను మద్యం సేవించారని, ఆ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారని అంటున్నారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అరగంటలో మరణించారు. వారు కూడా మద్యం సేవించారని తెలుస్తోంది. పోలీసుల పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరింత క్లారిటీ రానుంది.
గతంలో ఘటనలు..
ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్‌లో గతంలో జరిగిన విషపూరిత మద్యం ఘటనలను గుర్తు చేస్తుంది. 2009లో అహ్మదాబాద్‌లో జరిగిన లాఠీ చార్జ్ ఘటనలో 140 మంది మరణించారు. అదే విధంగా 2022లో బోటాడ్‌లో జరిగిన రసాయన సంఘటనలో 35 మంది మరణించారు. 2023 డిసెంబరులో ఖేడా జిల్లాలో జరిగిన సిరప్ ప్రమాదంలో 5 మంది మరణించారు. ఈ ఘటన ప్రతికూలంగా మారిన నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసు విభాగం దర్యాప్తు స్పీడప్ చేసింది.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 10 , 2025 | 02:48 PM