భార్యపై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..
ABN , Publish Date - Apr 14 , 2025 | 10:57 AM
Uttarakhand Man And Wife: ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.

పెళ్లంటే బంధంలాగా కాకుండా ఓ అవసరంలాగా మారిపోయింది. భార్య కావచ్చు.. భర్త కావచ్చు.. ఆ అవసరం తీరుతున్నంత వరకే బంధంలో ఉంటున్నారు. లేదంటే నిర్థాక్ష్యణ్యంగా అవతలి వాళ్లను వదిలేస్తున్నారు. తాజాగా, ఓ భర్త తన భార్యను కట్నం కోసం వేధించాడు. ఆమెకు నరకం అంటే ఏంటో చూపించాడు. కూతురు పుట్టడంతో ఆ వేధింపులు మరింత పెరిగాయి. కొడుకు కావాలంటూ మరింత వేధించాడు. ఆఖరికి పుట్టింటికి పంపించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పుట్టింటికి పోయిన భార్య.. విడాకులకు అప్లై చేయటంతో .. భరణం ఇవ్వాల్సి వస్తుందని ఇంటికి పిలిచి మరీ అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ జంటకు 2022 నవంబర్ నెలలో పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి అత్తింటి వారు తమ క్రూర బుద్ధిని బయటపెట్టారు. అదనపు కట్నం కోసం మహిళను వేధించసాగారు. ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు.. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. పుట్టింటికి వెళ్లిపోయిన తర్వాత ఆమె విడాకుల కోసం అప్లై చేసింది. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.
భర్త స్కూడ్రైవర్, సుత్తెతో ఆమెపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా ఆమెను కొట్టాడు. నొప్పి భరించలేకపోయిన ఆమె గట్టిగా అరవసాగింది. ఆమె అరుపులు విన్న పొరిగింటి వారు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. భర్త నుంచి ఆమెను విడిపించారు. దాడిలో తీవ్రంగా గాయడపడ్డ మహిళ.. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేసుకుంది. తర్వాత ముఖ్యమంత్రికి, ఉమెన్స్ హెల్ప్‌లైన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. ‘ వాళ్లు ఎప్పుడూ అదనపు కట్నం కావాలని హింసించే వారు. కొడుకు కావాలనే వారు. వాళ్లకు కావాల్సింది దొరక్కపోవటంతో .. నన్ను ఇంటినుంచి బయటకు పంపేశారు. తర్వాత ఇంటికి పిలిచి నా భర్త సుత్తె, స్కూడ్రైవర్‌తో దారుణంగా దాడి చేశాడు. అలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి’ అని అంది. మార్చి 30వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్