Minor Girls: రూములో బంధించి చిత్రహింసలు.. పాపం ఆ ఇద్దరు బాలికలు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:00 AM
Uttarakhand Minor Girls Incident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ ముగ్గురు వ్యక్తులు ... ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, రూములో బంధించారు. తర్వాత వారిపై దారుణంగా చిత్రహింసలకు పాల్పడ్డారు.

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. ప్రతీరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి చిన్నపిల్లలను కూడా వదటం లేదు. తాజాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ముగ్గురు కిరాతకులు.. ఇద్దరు బాలికలపై దాడికి పాల్పడ్డారు. వారిని చిత్రహింసలకు గురి చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్, బాగేశ్వర్ జిల్లా, ఖైబగాద్‌కు చెందిన 23 ఏళ్ల యోగేష్ గాడియ.. కాప్‌కట్‌కు లక్కీ కతాయత్, దీపక్‌లు ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. వారిని కాప్‌కట్‌లోని ఓ ఇంటి గదిలో బంధించారు.
ముగ్గురు కిరాతకులు కలిసి వారిని చిత్రహింసలు పెట్టారు. విచక్షణా రహితంగా కొట్టారు. వారు ఎంత ఏడ్చినా.. కొట్టొద్దని ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. అంతటితో వారి పైశాచికత్వం తగ్గలేదు. బాలికలను కొడుతూ దాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై స్పందించిన పోలీసులు .. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. పోలీసులు ఎదురుపడటంతో ఆ ముగ్గురు కారులో తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులపైకే దాడికి దిగారు. అయితే, ముగ్గురిలో యోగేష్ మాత్రమే పోలీసులకు చిక్కాడు.
మిగిలిన వారు అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. పరారీలో ఉన్న ఇద్దరికోసం కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ ఇద్దరు కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిపై నమోదైంది పోక్సో చట్టం కావటంతో బెయిల్ దొరికే అవకాశాలు కనిపించటం లేదు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బాలికలపై దాడికి పాల్పడిన ముగ్గురిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఊరికే వదిలేయకూడదంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..
Mudra Scheme: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా స్కీం..బిజినెస్ కోసం రూ. 20 లక్షల వరకు ఈజీ రుణాలు