Waqf Act: బెంగాల్‌లో మళ్లీ హింస.. పోలీసు వాహనాలకు నిప్పు, పలువురికి గాయాలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 08:38 PM
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) మద్దతుదారులు నిషేధాజ్ఞలు ధిక్కరించి పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు.

కోల్‌కతా: వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలు పశ్చిమబెంగాల్ (West Bengal)లో కొనసాగుతూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ముర్షీదాబాద్ తర్వాత తాజాగా బెంగాల్ సౌత్ 24 పరిగణాలలో హింస చెలరేగింది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) మద్దతుదారులు నిషేధాజ్ఞలు ధిక్కరించి పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. భంగర్ ఏరియాలో సోమవారంనాడు జరిగిన ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.
PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని
సెంట్రల్ కోల్‌కతాలోని రామ్‌లీలా మైదానం వైపు ఐఎస్ఎఫ్ మద్దతుదారులు పెద్దఎత్తున వెళ్తుండటంతో పోలీసు వారిని అడ్డుకున్నారు. రామ్‌లీల మైదాన్‌లో ఐఎస్ఎప్ నేత, భంగర్ ఎమ్మెల్యే నౌషధ్ సిద్ధిఖి చేపట్టిన వ్యక్ఫ్ వ్యతిరేక ర్యాలీకి వెళ్లేందుకు కార్యకర్తలు వెళ్తుండగా వీరిని బసంత్ హైవేపై పోలీసులు నిలువరించారు. ఆందోళనకారులు పోలీసు బారికేడ్లపై విరుచుకుపడటంతో ఇరువైపులా ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులు వాహనాలకు నిప్పుపెట్టారని, కొందరు పోలీసులు గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ముందస్తు అనుమతి లేకుండా రామ్‌లీలా గ్రౌండ్‌లో ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారని, ఇందుకు నిరసనగా ఐఎస్ఎఫ్ కార్యకర్తలు హైవేపై బైఠాయింపు నిరసనకు దిగారని, పోలీసు బలగాలకు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గత శుక్రవారంనాడు ముర్షీదాబాద్‌లో వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలు హింసకు దారితీయడంతో ముగ్గురు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..