Waqf Related Clashes: బెంగాల్‌లో మళ్లీ హింస, కత్తిపోట్లతో ఇద్దరు మృతి
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:42 PM
దుండగులు హర్గోబంద్ దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40) ఇంటిపై దాడి చేశారని, ఇంటిని లూటీ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోతూ కత్తులతో తండ్రీకొడుకులపై దాడి చేశారని, కత్తిపోట్లతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు అధికారి తెలిపారు.

కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి (Waqf Act) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ముర్షీదాబాద్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నిరసనలు హింసాత్మకంగా మారగా, శనివారం మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తలెత్తిన హింసాకాండలో ఇద్దరు మృతి చెందారు. మృతులను తండ్రీకొడుకులుగా గుర్తించారు. జఫ్రాబాద్‌లోని తమ ఇంట్లో కత్తిపోట్లతో ఈ ఇద్దరూ చనిపోవడాన్ని గుర్తించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు
దుండగులు హర్గోబంద్ దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40) ఇంటిపై దాడి చేశారని, ఇంటిని లూటీ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోతూ కత్తులతో తండ్రీకొడుకులపై దాడి చేశారని, కత్తిపోట్లతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు అధికారి తెలిపారు.
కాగా, శనివారం ఉదయం సంషేర్ గంజ్ బ్లాక్‌లోని ధులియాన్‌లో ఒక వ్యక్తి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. శుక్రవారం వక్ఫ్ చట్టంపై జరిగిన నిరసనల్లో సుతి, సంషేర్ గంజ్ ఏరియాల్లో పెద్దఎత్తున హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి 110 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముర్షీదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 10 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
ప్రశాంతతను పాటించండి: సీఎం
ముర్షీదాబాద్ జిల్లాలో వక్ఫ్ నిరసలు హింసాత్మకంగా మారడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు తీవ్రంగా స్పందించారు. వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉన్నప్పుడు అల్లర్లు ఎందుకని ప్రశ్నించారు. అల్లర్లను రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని మాతాల వారు సంయమనం పాటించాలని, శాంతిని పాదుకొలపాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..