Women Empowerment India: మహిళా సాధికారత పైపైకి.. కేంద్రం గణాంకాల్లో వెల్లడి
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:12 AM
విభిన్న రంగాల్లో మహిళల ప్రగతి వేగం పుంజుకుంటోందని కేంద్రం విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ 2024' నివేదిక తెలిపింది. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, పరిశ్రమలు వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: పలు రంగాల్లో మహిళా సాధికారత వేగం పుంజుకుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ 2024’ పేరిట ఆదివారం విడుదల చేసిన నివేదికలో పలు అంశాలను పరిశీలిస్తే.. జెండర్ పారిటీ ఇండెక్స్(జీపీఐ)లో బాలబాలికల వ్యత్యాసం అప్పర్ ప్రైమరీ ఎలిమెంటరీల్లో కనిపించినా.. ప్రాథమిక, హయ్యర్ సెకండరీల్లో స్థిరంగా ఉన్నట్లు గడిచిన నాలుగేళ్ల డాటా చెబుతోంది దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో మహిళల వాటా 39.2%. మొత్తం డిపాజిట్లలో వారి వాటా 39.7శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల డిపాజిట్ల వాటా 42.2శాతంగా ఉండడం గమనార్హం..! స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన డీమాట్ ఖాతాల్లోనూ మహిళలు పురోభివృద్ధి సాధిస్తున్నారు. 2021-24 మధ్యకాలంలో దేశంలోని డీమాట్ ఖాతాల సంఖ్య 3.32 కోట్ల నుంచి 14.3 కోట్లకు పెరిగింది. ఇందులో మహిళల భాగస్వామ్యం 2021లో 66 లక్షలుగా ఉండగా.. 2024 కల్లా.. 2.77 కోట్లకు పెరిగింది. మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమలు కూడా పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఉత్పాదకరంగంలో వారి వాటా 58.4శాతంగా ఉంది. వాణిజ్యంలో 13.7%, ఇతర సేవల్లో 14.2% వాటాను కలిగి ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News