Beauty Tips: ఫేస్ మేకప్‌ను ఇలా సాధారణ చిట్కాలతో తొలగించుకోండి..
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:04 PM
అమ్మాయిలకు మేకప్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది లేకుండా ఇంట్లో నుంచి అసలు బయటకురారు. ముఖానికి అప్లై చేసే రిమూవల్‌లో కొంచెం తేడా వచ్చినా చర్మమే దెబ్బతింటుంది. అయితే, ఫేస్ మేకప్‌ను సాధారణ చిట్కాలతో ఎలా తొలగించుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
Beauty Tips: ఆడపిల్లలకు అందంగా రెడీ అవ్వడం అంటే మహా ఇష్టం. పెళ్లిళ్లతోపాటు ఇతర ఫంక్షన్లలో మేకప్ కంపల్సరీగా ఉండాల్సిందే. కొంతమంది మేకప్ లేకుండా బయట అడుగు కూడా వేయరు. అయితే, మేకప్ వేసే ముందు దాన్ని తొలగించడం గురించి కూడా తెలుసుకోవాలి. ముఖానికి మేకప్ ఎక్కువ సేపు ఉంచడం చర్మ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అలాంటి మేకప్‌ని తొలగించడం అనుకున్నంత సులభం కాదు. మేకప్‌ను సరైన మార్గంలో తొలగించడానికి ఈ కొన్ని చిట్కాలను అనుసరించండి.
క్లెన్సింగ్ ఆయిల్:
క్లెన్సింగ్ ఆయిల్‌తో ముఖంపై మేకప్‌ను శుభ్రం చేసుకోవచ్చు. క్లెన్సింగ్ ఆయిల్ మొండి మేకప్‌ను తొలగించడమే కాకుండా, రసాయనాలతో నిండిన మలినాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇది చర్మానికి హాని కలిగించదు.
మేకప్ రిమూవర్:
మార్కెట్‌లో లభించే ఈ లిక్విడ్ మేకప్ రిమూవర్ తేమ కారణంగా మేకప్‌ను సులభంగా తొలగించగలదు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే ఎటువంటి జిడ్డు లేకుండా ముఖాన్ని శుభ్రపరుస్తుంది.
మేకప్ రిమూవర్ వైప్స్:
మార్కెట్‌లో లభించే వైప్స్‌తో మేకప్ తొలగించుకోవచ్చు. ఈ మేకప్ రిమూవల్ వైపర్ చర్మంలోని మలినాలను తొలగిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బాదం నూనె:
వంటగదిలో ఉండే ఈ వస్తువులు మేకప్‌ను తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఇంట్లో జీడిపప్పు, బాదం నూనె ఉంటే మేకప్‌ను తొలగించుకోవచ్చు. దూదిని నూనెలో ముంచి ముఖంపై రుద్దితే మేకప్ తొలగించుకోవచ్చు.
కొబ్బరి నూనె:
స్వచ్ఛమైన కొబ్బరి నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మేకప్‌ను తొలగించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది చర్మం నుండి రసాయనాలను తొలగిస్తుంది.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)
Updated Date - Jan 05 , 2025 | 01:04 PM