Smart Inventions: ఈ భార్గవి స్మార్ట్ టీచర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:10 AM
హెల్మెట్ పెట్టుకోకపోతే బండి నడవదు, మద్యం సేవిస్తే వాహనం స్పందిస్తుంది – ఇవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఓ టీచరమ్మ చేసిన ఆవిష్కరణలు. ఆమె సాదాసీదా జీవితం వెనుకున్న విజ్ఞాన మార్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది.

హెల్మెట్ పెట్టుకోకపోతే బండి ముందుకు కదలనంటుంది. మద్యం సేవిస్తే వాహనంలోని సెన్సర్ పసిగట్టేస్తుంది. పొడి చెత్త డబ్బాలో తడి చెత్త వేస్తే అప్రమత్తం చేస్తుంది. ఇవి ఏ శాస్త్రవేత్తలో కనుగొన్నవి కావు... బడా సంస్థల ఆర్ అండ్ డీ విభాగం సృష్టి అంతకన్నా కాదు... ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అద్భుత ఆవిష్కరణలు. ఆ టీచరమ్మ పేరు..
విజయభార్గవి. శ్రీసత్యసాయి జిల్లా రేకులకుంట ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఆమె తన ఆవిష్కరణల గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.
‘‘సరిగ్గా ఐదేళ్ల కిందట... మావారు జయప్రకాశ్ బైక్ మీద ప్రయాణిస్తుండగా కింద పడ్డారు. బాగా గాయాలయ్యాయి. ఆ సమయంలో ఆయన హెల్మెట్ ధరించలేదు. ఇది నన్ను ఎంతో ఆందోళనకు గురి చేసింది. ఆలోచనల్లోకి నెట్టింది. రోజూ ఎక్కడో ఒకచోట ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోకపోవడంవల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మావారి ఘటన తరువాత ఇలాంటివెన్నో ఉదంతాలు ఒక్కసారి నా కళ్ల ముందు తిరిగాయి. అలాగే మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే జరిగే నష్టం అంతాఇంతా కాదు. వీటివల్ల వాహనం నడిపేవారికే కాదు... ఎదుటివారికి కూడా ప్రమాదమే. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆలోచిస్తుంటే తట్టిందే స్మార్ట్ హెల్మెట్. కొద్ది రోజుల్లోనే నా ఆలోచనకు రూపం ఇచ్చాను. అది నాలో ఎనలేని స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపింది. ఆ తరువాత వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూసేలా స్మార్ట్ డస్ట్‌బిన్ ఒకటి తయారు చేశాను. దీనికి కూడా మంచి స్పందన వచ్చింది.
పాఠాలు చెబుతూనే...
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మా నివాసం. మావారు కూడా ఉపాధ్యాయుడే. ప్రస్తుతం నేను మడకశిర మండలం రేకులకుంట ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్నాను. ఒక పక్క పిల్లలకు పాఠాలు చెబుతూనే మరోవైపు వినూత్న ప్రయోగాలు చేస్తుంటాను. నిత్యవిద్యార్థినిలా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. సాంకేతిక పరిజ్ఞానంతో మన రోజువారీ జీవితానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనేది నా తపన. దాని కోసం వివిధ రకాల పరికరాలను రూపొందించి, పలు సైన్స్ ఫెయిర్స్‌లో ప్రదర్శిస్తుంటాను. అలా నా ఆవిష్కరణలకు బహుమతులు కూడా అందుకున్నాను. బోధనతో పాటు ప్రయోగాలు కూడా నా దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి.
అపరిశుభ్రంగా తయారవుతాయి. ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొనే నేను ఆవిష్కరణల దిశగా అడుగులు వేశాను. దీనికి ప్రభుత్వాల సహకారం తప్పనిసరి. ముఖ్యంగా స్మార్ట్ హెల్మెట్, ఆధార్ ఆధారిత డస్ట్‌బిన్‌కు పేటెంట్ రైట్స్ ఇచ్చి, సమాజానికి ఉపయోగపడేలా వాటిని వినియోగంలోకి తీసుకురావాలి.
హెల్మెట్ ధరిస్తే...
సాధారణ హెల్మెట్‌కు కొన్ని పరికరాలు అమర్చి స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాను. తొలుత ప్రత్యేక సెన్సర్లతో ఓ డివైజ్‌ను రూపొందించాను. దాన్ని హెల్మెట్‌కు అమర్చాను. దీనిని మోటార్ సైకిల్ స్టార్టర్‌కు అనుసంధానం చేశాను. దీనివల్ల హెల్మెట్ ధరిస్తేనే వాహనం స్టార్ట్ అవుతుంది. ఇక హెల్మెట్‌లో ఉండే సెన్సర్... మద్యం వాసనను కూడా పసిగడుతుంది. మద్యం సేవించి వాహనం నడపాలని ప్రయత్నిస్తే అది ఆగిపోతుంది. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తీసినా వాహనం ఆగిపోతుంది. స్మార్ట్ హెల్మెట్ ధరించి వాహనం నడిపే సమయంలో ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులతో సహా ఎంపిక చేసుకున్న మొబైల్ నంబర్లకు వెంటనే మెసేజ్ వెళుతుంది. ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ప్రమాదం జరిగిందో కూడా సమాచారం చేరవేస్తుంది. జీపీఆర్‌ఎస్ ద్వారా 108 అంబులెన్స్‌కూ సమాచారం పంపుతుంది. కేవలం రెండు వేల రూపాయల ఖర్చుతో ఈ హెల్మెట్‌ను తయారు చేశాను.
చెత్తకు ఆధార్ స్కాన్...
రోడ్ల పక్కన ఉండే డస్ట్‌బిన్‌లను కూడా ‘స్మార్ట్’గా మార్చే ప్రయత్నం చేశాను. వీధుల్లో కుటుంబ యజమానుల ఆధార్ స్కాన్ అయ్యేలా డస్ట్‌బిన్‌లను రూపొందించాను. ఎవరైనా చెత్తను తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేస్తే, వెంటనే ఆ మెసేజ్ మునిసిపాలిటీ లేదా పంచాయతీకి చేరుతుంది. పొడి చెత్త స్థానంలో తడిచెత్త వేస్తే వెంటనే అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. డస్ట్‌బిన్ నిండినా, చెత్త కుళ్లిపోయినా సంబంధిత మునిసిపాలిటీ లేదా పంచాయతీకి సమాచారం చేరుతుంది. దీంతోపాటు ఎవరెవరు ఎన్నిసార్లు కుండీలో చెత్త వేశారనేది కూడా తెలుస్తుంది. ఈ పరికరం ద్వారా చెత్తను డస్ట్‌బిన్‌లో వేయనివారిని కూడా గుర్తించవచ్చు. తద్వారా వీధుల్లో చెత్త పడేయకుండా కట్టడి చేయవచ్చు.
పురస్కారాలు... ప్రశంసలు...
నా ఆవిష్కరణలకు మంచి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ నుంచి అవార్డు అందుకున్నాను. గతంలో హైదరాబాద్‌కు చెందిన ‘విజ్ఞానదర్శని’ సంస్థ ఉమెన్స్ ఫెస్టివల్ పురస్కారం ఇచ్చింది. 2023లో స్మార్ట్ హెల్మెట్ ఆలోచనకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి బహుమతి పొందాను. పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, కాలుష్య నియంత్రణ, అనారోగ్య సమస్యలకు పరిష్కారం, పారిశ్రామిక వ్యర్థాలు తగ్గించడం, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆహార భద్రత, విద్యుత్ తదితర వాటిలో నూతన ఆవిష్కరణలు చేసినందుకు పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నాను. నిత్య జీవితంలో జన జీవితానికి ఉపయోగపడే మరిన్ని పరికరాలు రూపొందించాలనేది నా ఆకాంక్ష. దాని కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను.’’
బాలకృష్ణ, హిందూపురం
సహకారం అందించాలి...
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కుటుంబాలు దిక్కులేనివైపోతాయి. ఎక్కడబడితే అక్కడ చెత్తవేస్తే పరిసరాలు
ఇవి కూడా చదవండి..
Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
For National News And Telugu News