Low Iron Signs: ఐరన్ తక్కువైందని తెలిసేదెలా
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:54 AM
శరీరంలో ఐరన్ స్థాయి తక్కువైతే అలసట, నీరసం, తల తిరుగుడు, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

జీవక్రియలు సజావుగా జరగడానికి ఐరన్ అత్యవసరం. పోషకాహార లోపం వల్ల ఒక్కోసారి శరీరంలో ఐరన్ మోతాదు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి పలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఐరన్ స్థాయి తగ్గిందని తెలిపే సంకేతాల గురించి నిపుణులు ఇలా చెబుతున్నారు.
సాధారణంగా కాళ్లు, చేతులు కొద్దిగా వేడిగా ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపిస్తే కాళ్లు, చేతులు చల్లగా అనిపిస్తాయి.
చిన్న పని చేసినా అలసట వస్తుంది. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సుద్ద, సబ్బు, బలపాలు తినాలనే కోరిక ఏర్పడుతుంది.
శరీరంలో ఐరన్ తగినంత పరిమాణంలో లేని పక్షంలో ఊపిరి సరిగా ఆడదు. బలంగా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది.
తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు పడుకున్నప్పటికీ నిద్ర మబ్బు వదలదు
గోర్లు త్వరగా విరిగిపోతూ ఉంటాయి. కండరాలు పట్టేసినట్లు ఉంటాయి.
శిరోజాలు అధికంగా రాలిపోతూ ఉంటాయి. చర్మం పొడిబారుతుంది. పెదవులు పగిలిపోతాయి. కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి.
శరీరంలో ఐరన్ స్థాయి తగ్గితే రక్త హీనత ఏర్పడుతుంది. దీంతో మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. శరీరం వణుకుతూ ఉంటుంది. నిలబడడం కష్టమవుతుంది.
ఐరన్ లోపం వల్ల గుండెలోని కండరాల పనితీరు మందగిస్తుంది. గుండె దడగా అనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి..