Soda Tea Recipe: వేసవి ఉపశమనం సోడా టీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:01 AM
వేసవిలో శరీరానికి శాంతిని ఇవ్వడానికి సోడా టీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. టీ, తేనె, నిమ్మరసం, సోడా కలయికతో ఈ చల్లటి పానీయం తక్కువ సమయంలో తయారవుతుంది

వేసవిలో జ్యూస్‌లు మాత్రమే కాదు... చల్లటి టీ కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ టీని ఎలా చేయాలో చూద్దాం...
తయారీ విధానం
టీ పొడి లేదా టీ ఆకులను బాగా మరిగించాలి. డికాక్షన్‌ను తీసి ఒక గిన్నెలో పోసి చల్లార్చాలి. దానిలో తేనె కలపాలి.
దీనిలో తగినంత నిమ్మరసం వేయాలి. బాగా కలపాలి. ఆ తర్వాత దానిలో చల్లటి సోడాను పోయాలి. ఐస్ ముక్కలను వేయాలి.
టీ పౌడర్ కన్నా టీ ఆకులను ఉపయోగిస్తే మంచి రుచి వస్తుంది.
కొందరు తేనెకు బదులుగా బెల్లం పొడిని కూడా వాడతారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది.
నిమ్మ రసంతో పాటుగా నిమ్మకాయ ముక్కలను వేస్తే అదనపు రుచి వస్తుంది.