Share News

Summer Tips with curd: వేసవిలో కమ్మని పెరుగు

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:49 AM

వేసవిలో పెరుగు త్వరగా పుల్లగా మారుతుంటుంది, దీని వలన తినాలనిపించదు. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పెరుగు కమ్మగా, తాజాగా ఉండేలా చేయవచ్చు.

Summer Tips with curd: వేసవిలో కమ్మని పెరుగు

ఎండాకాలంలో పెరుగు తొందరగా పులుపు ఎక్కుతూ ఉంటుంది. ఈ పుల్లటి పెరుగు ఎవరికీ తినాలనిపించదు. ఇలా కాకుండా కొన్ని చిట్కాలతో వేసవిలో కూడా పెరుగు కమ్మగా ఉండేటట్లు చేయవచ్చుం

చాలామంది బజారు నుంచి పాలు తెచ్చి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తూ ఉంటారు. తరవాత ఎప్పటికో వాటిని కాచి తోడు పెడతారు. ఆలా కాకుండా తాజా పాలను తెచ్చిన వెంటనే బాగా మరిగించి తరవాత చల్లార్చి తోడు పెట్టాలి. ఇలా తయారైన పెరుగు ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. పాలను తోడు పెట్టడానికి పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగునే వాడాలి.

పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టకూడదు. అలాగే పాలు పూర్తిగా చల్లారినా కూడా పెరుగు సరిగా తోడుకోదు. గోరువెచ్చని పాలలో కొద్దిగా పెరుగు వేసి నెమ్మదిగా కలపాలి.

మట్టి పాత్ర లేదా సిరామిక్‌ పాత్రలో పాలు పోసి తోడుపెడితే పెరుగు గట్టిగా కమ్మగా తయారవుతుంది.

పాలను తోడు పెట్టేముందు అందులో ఒక చెంచా పంచదార కలిపితే పెరుగు త్వరగా పులుపు ఎక్కకుండా ఉంటుంది.


ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల పాలు తీసుకొని అందులో అర చెంచా కమ్మని పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తోడు పెట్టాలనుకుంటున్న పాలలో

వేసి కలిపి మూతపెట్టాలి. ఇలా చేయడం వల్ల కమ్మని గడ్డ పెరుగు తయారవుతుంది. ఇది త్వరగా పులుపు ఎక్కదు.

ఒక వెడల్పాటి గిన్నెలో సగం వరకు నీళ్లు పోయాలి. ఇందులో పాలు తోడుపెట్టిన గిన్నెను ఉంచితే ఆరు గంటల్లో కమ్మని పెరుగు తయారవుతుంది. ఎండాకాలంలో ఈ పద్ధతిని పాటిస్తే పెరుగు ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.

పాలను రాత్రిపూట తోడుపెడితే తెల్లారేసరికి తోడుకుని పెరుగు తయారవుతుంది. దీన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెడితే రోజంతా తాజాగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 01:49 AM