Relationship Tips: మీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫీస్ లో బాస్ అయితే అతనితో ఇలాగే ప్రవర్తించండి..
ABN, Publish Date - Jan 04 , 2025 | 06:45 PM
ఆఫీసులో స్నేహం ఒక విలువైన సంబంధం. ఇది పని ఒత్తిడిని తగ్గించి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కానీ, మీ స్నేహితుడు ప్రమోషన్ పొంది మీకు బాస్ అయితే ఈ పరిస్థితి సవాలుగా ఉంటుంది.
Relationship Tips: ఆఫీసులో స్నేహం ఒక విలువైన సంబంధం. ఇది పని ఒత్తిడిని తగ్గించి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కానీ, మీ స్నేహితుడు ప్రమోషన్ పొంది మీకు బాస్ అయితే ఈ పరిస్థితి సవాలుగా ఉంటుంది. ఈ కొత్త స్నేహాన్ని తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీ స్నేహ బంధంతోపాట కెరీర్ పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
1. గౌరవించండి:
ముందుగా మీ స్నేహితుడు ఇప్పుడు మీకు సీనియర్ అయ్యారని అర్థం చేసుకోండి. స్నేహానికి దాని స్థానం ఉంటుంది. కానీ, వృత్తిపరమైన సంబంధాలను గౌరవించడం మీ బాధ్యత. అతని నిర్ణయాలను వ్యక్తిగతంగా తీసుకునే బదులు, బాస్ దృష్టికోణం నుండి వాటిని చూడటానికి ప్రయత్నించండి.
2. పరిమితులను గుర్తుంచుకోండి:
ఆఫీస్‌లో స్నేహం, వృత్తిపరమైన సంబంధాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. విరామ సమయంలో లేదా ఆఫీస్ సమయం అయిపోయాక మీ సంభాషణలను కొనసాగించండి. పనిలో ఉన్న మీ స్నేహితుడితో మీరు ఇతర యజమానితో వ్యవహరించే విధంగానే వ్యవహరించండి.
3. ఫిర్యాదులు చేయకండి:
మీ పనిలో నిజాయితీని కొనసాగించండి. బాస్ మీ ఫ్రెండే కదా అని అతని నుండి ఎక్కువగా సహాయం తీసుకోవడం మంచిది కాదు. బాస్ అయిన తర్వాత స్నేహాన్ని ముగించాల్సిన అవసరం లేదు. కానీ సంభాషణ, ప్రవర్తనలో వృత్తిపరమైన శ్రద్ధ వహించండి. మీ స్నేహం, వృత్తిపరమైన సంబంధానికి హాని కలిగించే గాసిప్, ఫిర్యాదులు లేదా వెక్కిరింపులను నివారించండి.
4. అర్థం చేసుకోండి:
పని విషయంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని తిట్టినా లేదా మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. అతను తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడని అర్థం చేసుకోండి.
6. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి
కొన్నిసార్లు మీ స్వంత వైఫల్యం కంటే మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క పురోగతి ఎక్కువగా బాధపెడుతుందని అంటారు. మీరు ఈ అవకాశాన్ని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి, వృత్తిపరంగా మరింత సక్సెస్ సాధించడానికి ఒక అవకాశంగా పరిగణించాలి. మీ స్నేహితుడిపై అనవసరంగా అసూయపడటం వల్ల ఏమీ సాధించలేరు. మీరు ప్రమోషన్ ఎలా పొందాలో నేర్చుకోవడం మంచిది.
Updated Date - Jan 04 , 2025 | 07:04 PM