Daily Curd Facts: రోజూ పెరుగు తిందాం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:14 AM
పెరుగు ప్రొబయాటిక్స్ వల్ల జీర్ణశక్తిని పెంచి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వేసవిలో మధ్యాహ్న భోజనానికి తర్వాత పరిమితంగా తీసుకోవడం మంచిది

ఆహారంలో ఆరోగ్యం
వేసవిలో చల్లదనం కోసం తప్పనిసరిగా పెరుగు తింటూ ఉండాలని అంటూ ఉంటారు. ఇదెంత వరకూ నిజమో తెలుసుకుందాం!
పెరుగులో నీటి శాతం ఎక్కువ. అలాగే దీన్లోని ప్రొబయాటిక్ పరిమాణం పొట్టను చల్లగా ఉంచుతుంది. అలాగని పెరుగుతో, వేసవిలో పెరిగే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల, జీర్ణశక్తి పెరుగుతుంది. పేగుల ఆరోగ్యం, పోషకాల శోషణ పెరుగుతాయి. అయితే ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు ప్రతి రోజూ పెరుగు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, డయేరియా బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే పరిమితికి మించి పెరుగు తిన్నా, జీర్ణాశయ సమస్యలు తప్పవు. బరువు కూడా పెరుగుతారు. అలాగే పెరుగు ద్వారా అందే అదనపు క్యాల్షియం వల్ల ఐరన్, జింక్ పోషకాల శోషణ కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగు ప్రయోజనాలను పొందాలంటే, పరిమితంగానే తినాలి. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా సరిపడా పెరుగు తింటూ ఉండాలి.
ఇవి కూడా చదవండి..