ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Traditions: అతిథులు ఇంటికి రాగానే నీళ్లు ఎందుకు ఇస్తారో తెలుసా?

ABN, Publish Date - Jan 03 , 2025 | 02:30 PM

'అతిథి దేవోభవ' అని మన పెద్దలు అంటారు. అతిథులు దేవుడితో సమానం అని, మనం అతిథులను ఆదరిస్తే దేవుడిని గౌరవించినట్లే అని నమ్ముతారు. అందుకే ఇంటికి వచ్చిన అతిథులకు ముందుగా ఒక గ్లాసు నీళ్లు ఇస్తాం. అయితే, గ్లాసు నీళ్లు ఎందుకు ఇస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Traditions: భారతీయ సంస్కృతిలో అతిథులను దేవతలుగా సూచిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులను చిరునవ్వుతో పలకరించి ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగిస్తారు. ఇప్పుడు కాలం మారింది, కాలంతో పాటు ట్రెండ్స్ కూడా మారాయి. అయినా ఇంటికి వచ్చిన అతిథులకు నీళ్లు ఇవ్వడం మారలేదు. పురాతన కాలం నుండి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది మన ఆతిథ్యానికి, మర్యాదకు నిదర్శనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి.

పూర్వ కాలంలో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. దూరపు పట్టణాల నుంచి బండ్లు, గుర్రాలపై ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చేవారు. అందుకే ఇంటికి రాగానే ముందుగా చల్లటి నీళ్లు ఇచ్చారు. దీంతో వారికి సత్వర ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో నీళ్ళు దొరికితే స్వర్గం వచ్చినట్లే. నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా మన శరీరం, మనస్సుపై అనేక సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. నీరు శారీరక అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా, మనం త్రాగే నీరు మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తలనొప్పి, ఒత్తిడి లేదా ఆందోళన కూడా మాయమవుతుంది. నీరు నివారణలా పనిచేస్తుంది.


సగౌరవంగా..

ఇప్పటికీ చాలా గ్రామాలలో అతిథులకు రాగి చెంబు లేదా మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీటిని అందిస్తారు. రెండు చేతులతో సగౌరవంగా అందించి వారిని స్వాగతిస్తారు. అలసిపోయిన అతిథులకు ఈ విధంగా నీరు ఇవ్వడం వల్ల వారు చాలా సంతృప్తి చెందుతారు. మరికొందరు అతిథులకు నీళ్లకు బదులు మజ్జిగ లేదా నిమ్మరసం ఇస్తారు. ఇది వారి అతిథుల పట్ల వారికి ఉన్న ప్రేమ, శ్రద్ధను చూపుతుంది.

నీరు స్వచ్ఛత, ప్రేమకు చిహ్నం:

అతిథులకు మొదటి నీటిని అందించడం అంటే వారి పట్ల మనకున్న గౌరవం, ప్రేమ. ఇది ఇంట్లో వారికి స్వాగతం పలుకుతున్న అర్థం. మన సంస్కృతిలో అతిథులను దేవుళ్లుగా చూస్తాం. కాబట్టి వారికి సేవ చేయడం మన బాధ్యత.

“అతిథి దేవో భవ”

ఓవరాల్‌గా ఇంటికి వచ్చిన అతిథులకు నీరు ఇవ్వడం సంప్రదాయం మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో భాగం. మన ప్రేమ, మర్యాదలను చూపించడానికి ఒక గొప్ప మార్గం. నీటిని అందించడం ద్వారా, మీరు చెప్పకుండానే "మీరు మాకు ముఖ్యం" అని అతిథికి తెలియజేయడం. మన సంస్కృతిలో “అతిథి దేవో భవ” అనే గొప్ప భావనకు ఇది ఒక చిన్న ఉదాహరణ. తరాలు మారినా మన సమాజంలో ఈ సంప్రదాయం ఇంకా సజీవంగా ఉంది.

Updated Date - Jan 03 , 2025 | 02:30 PM