సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Mar 31 , 2025 | 07:37 AM
సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందించే పథకాన్ని ఉగాది రోజున ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభావేదిక నుంచి హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, లబ్దిదారులతో ముఖ్యమంత్రి...

సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజాపాలన ప్రగతి భాటలో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ప్రజాపాలన ప్రగతి భాటలో పాల్గొని ప్రసంగిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హుజూర్‌నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం వేదికపై నుంచి ప్రజలకు అభివాదం తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక నేతలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది కార్యక్రమానికి హాజరైన జనం...
వేదికపై ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హుజూర్‌నగర్ పట్టణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చములందజేస్తున్న సీఎస్, టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఉత్తమ్, కోమటిరెడ్డి తతరులు..
Updated Date - Mar 31 , 2025 | 07:37 AM